పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 543వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, పెదపరిమి, మోతడక, ఉద్ధండరాయునిపాలెం, పెదపరిమి, మోతడక గ్రామాల్లో నిరసనలు కొనసాగించారు.
ప్రభుత్వం వెంటనే కౌలు చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల రైతులపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కౌలు చెల్లించకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.
ఇదీచదవండి
Raghurama letter to Jagan: సీఎంకు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..!