Amaravathi farmers Committee: అమరావతి ఐకాస రైతు సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేస్తోంది. గ్రామాల వారీగా సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. రాజధాని గ్రామాల్లో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఐకాసకు అనుబంధంగా సంక్షేమ సంఘాలను సిద్ధం చేస్తున్నారు. తొలివిడతగా వెంకటపాలెం, మందడం,మల్కాపురం, దొండపాడులో ఈ రైతు సంక్షేమ సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. నాలుగు గ్రామాల సంక్షేమ సంఘాలకు రిజిస్ట్రేషన్ పూర్తికాగా...మందడం రైతు సంక్షేమ సంఘం కార్యాలయాన్ని రాజధాని రైతు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రారంభించారు. మందడం రైతు సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కట్ట రాజేంద్రను ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి : Support Rally for New Districts : కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ మహిళల ర్యాలీలు..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!