రాజధాని గ్రామాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. తాము ఏ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించకుండా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు, మహిళలు 434వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం గ్రామాల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయంపై రైతులు పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెంలో నిరాహార దీక్షలు చేశారు.
ఇదీ చదవండి: