కరోనా కట్టడికి ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 18 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 12 నుంచి మర్నాడు ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించనునున్నట్లు పేర్కొంది.
ఆర్టీసీకీ తప్పదు..
ఉదయం 6 నుంచి మ. 12 వరకే దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు.. ఈ మేరకు ఆర్టీసీ బస్సులు నడుచుకోనున్నట్లు స్పష్టం చేసింది. మ. 12 తర్వాత ప్రజా రవాణా సహా ప్రైవేట్ వాహనాలు బంద్ కానున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టి నుంచి మ. 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు సైతం మూసివేస్తున్నట్లు వివరించింది.
అకారణంగా సంచరిస్తే కేసులే..
అకారణంగా బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.
ఇవీ చూడండి : నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు