అచ్చెన్నాయుడికి మద్దతుగా ఇవాళ రాష్ట్రమంతటా తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. బలహీన వర్గాల నాయకుడైన అచ్చెన్నాయుడు పట్ల ప్రభుత్వ దాష్టీకాన్ని నిరసిస్తూ... ప్రజలందరూ వియ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించాలని సూచించారు. ఇళ్ల వద్దే నిరసన తెలుపుతూ...కాగడాల ప్రదర్శన నిర్వహించాలని కోరారు.
ఇవీ చదవండి: ఈఎస్ఐ మందుల కొనుగోలు అక్రమాల్లో అచ్చెన్నాయుడు అరెస్ట్