ETV Bharat / city

కరోనా కాలంలో కాస్త ఆగండి.. మందుబాబులూ

author img

By

Published : Jul 29, 2020, 6:49 AM IST

కరోనా విజృంభిస్తున్నా మందు బాబులు జంకడంలేదు. కంటైయిన్‌మెంట్‌ ప్రాంతాల నుంచి మద్యం ప్రియులు వేరే ప్రాంతాలకు వెళ్లి మరీ మద్యం కొనుగోలు చేస్తున్నారు. వారూ వైరస్‌ వ్యాప్తికి కారణం కావొచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాలు మూసేయాలని పలు చోట్ల నిరసనలు చేస్తున్నారు.

alcoholics didn't stop drinking on corona time
మందుబాబులు

కరోనా భయంతో జనం అల్లాడుతున్నారు. కొత్తవారు కనిపిస్తే అంత దూరం పెడుతున్నారు. అలాంటిది తమ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాలకు ఎక్కడెక్కడి నుంచో మద్యం ప్రియులు పెద్దసంఖ్యలో తరలిరావడం, మాస్కులు లేకుండా గుమిగూడటంతో వైరస్‌ వ్యాపిస్తుందని భయపడుతున్నారు. తక్షణమే తమ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలంటూ స్థానికులు, మహిళలు ఆందోళన బాట పడుతున్నారు. గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఏదో ఒక చోట ఇలాంటి నిరసనలు నిత్యం కనిపిస్తున్నాయి. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో దుకాణాలు మూసేయడంతో అక్కడివారు మద్యం కోసం సమీప ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరిగి బారులు తీరుతున్నారు. భౌతికదూరం పాటింపు, మాస్కులు పెట్టుకోవటం వంటి నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. ఇది కరోనా వ్యాప్తికి కారణమవుతుందన్న ఆందోళనతో స్థానికులు మద్యం దుకాణాల వద్ద నిరసనలకు దిగుతున్నారు.

వివిధ ప్రాంతాల్లో నిరసనలు

  • ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి మద్యం దుకాణానికి జనాల తాకిడి పెరగటంతో దాన్ని మూసేయాలని మహిళలు ఇటీవల ఆందోళన చేశారు. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులోని దుకాణాన్ని మూసేయాలని నిరసన వ్యక్తం చేశారు.

  • తెలంగాణలోని మద్యం గొలుసు దుకాణాలకు తమ గ్రామాల మీదుగా వెళ్తున్నారంటూ ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కృష్ణా జిల్లా మైలవరం మండల గ్రామాల మహిళలు ఆందోళన చేశారు. రహదారికి దుంగలు అడ్డంగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు.

  • నెల్లూరు జిల్లా విడవలూరులో మద్యం దుకాణాలను మూసేయాలని స్థానికులు రెండు రోజుల కిందట ధర్నా చేశారు. కోట మండలం గోవిందపల్లిలో మద్యం దుకాణాలు మూసేయాలంటూ ఇటీవల అక్కడి ప్రజలు ఆందోళన చేశారు.

అక్కడ మూత.. ఇక్కడ రద్దీ

విజయనగరం జిల్లా మక్కువలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అక్కడున్న రెండు మద్యం దుకాణాలను మూసేశారు. ఆ ప్రాంత మందుబాబులు శంబరలో ఉన్న దుకాణానికి పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. దీంతో శంబరలో మద్యం దుకాణాన్ని మూసేయాలంటూ అక్కడివారు రెండు రోజుల కిందట నిరసనకు దిగారు. డెంకాడ మండలం పెదతాడివాడలోనూ ఇదే పరిస్థితి. మద్యం కోసం విజయనగరం నుంచి అక్కడికి వెళ్తుండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఎక్కడెక్కడి నుంచో మద్యం కోసం వస్తున్నారు. మా ఊరంతా జనం, వాహనాలతో నిండిపోతోంది. ఇక్కడే తాగి పడిపోతున్నారు. దీంతో మా ఊళ్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. వెంటనే ఇక్కడున్న మద్యం దుకాణాన్ని మూసేయండి’’ అని డిమాండు చేస్తూ గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు మహిళలు ఇటీవల మద్యం దుకాణం వద్ద నిరసనకు దిగారు. అధికారులు ఆ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయించారు.

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం, కడప సరిహద్దు ప్రాంతమైన రాజుపాలెంలో మద్యం దుకాణాలు మూసేశారు. అక్కడి నుంచి చాగలమర్రికి మద్యం కోసం వస్తున్నారు. భౌతికదూరం పాటించకుండా వందలమంది గుమిగూడుతున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా మేడికొండూరు, పేరేచర్ల, ఫిరంగిపురం, నూదురుపాడు, బేతపూడి, సత్తెనపల్లి ప్రాంతాల్లో మద్యం దుకాణాల్ని మూసేయటంతో వీరంతా సిరిపురం వస్తున్నారు. అక్కడ మందుబాబుల రద్దీ భారీగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: కొవిడ్‌ సోకినా వెనక్కు తగ్గని నవతరం వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.