ETV Bharat / city

'బతుకు బరువై.. వలసబాట'.. అన్నదాతల ఆత్మహత్యలతో చెదిరిపోతున్న కుటుంబాలు - అన్నదాతల ఆత్మహత్యలతో చెదిరిపోతున్న కుటుంబాలు

FARMERS SUIICDE: ఆరుగాలం శ్రమించి, అందరికీ తిండిపెట్టే రైతన్న.. పంట కలిసిరాక అప్పుల పాలవుతున్నాడు. మరేదారీ కానరాక.. ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటున్నారు. దీంతో అన్నదాతపైనే ఆధారపడిన ఆ కుటుంబం చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోతున్నారు. కొన్ని కుటుంబాలు ఊరు విడిచిపోతున్నాయి. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. భార్యాబిడ్డలు కూలి పనులు వెతుక్కుంటూ దూరప్రాంతాలకు వలస పోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది.

FARMERS SUIICDE
FARMERS SUIICDE
author img

By

Published : Jul 15, 2022, 8:31 AM IST

FARMERS SUIICDE: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను పరిశీలిస్తే 85% మంది దుర్భర జీవనం వెళ్లదీస్తున్నారు. కుటుంబ యజమాని దూరమయ్యాడనే ఆవేదనను దిగమింగుతూ.. పోషణకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు అప్పుల వాళ్ల ఒత్తిడినీ ఎదుర్కొంటున్నారు. రైతు మరణిస్తే ఉపాధి కోసం భార్యాబిడ్డలు ఊరు విడిచి వెళుతుండగా.. అతనిపైనే ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. రైతుల ఆత్మహత్యలు, దానికి కారణాలు, నివారణ చర్యలపై ప్రభుత్వ దృష్టి కొరవడింది. కొందరికి పరిహారం, మరికొందరికి బీమా పంపిణీకే పరిమితమవుతోంది. రైతు పిల్లల భవిష్యత్తును పట్టించుకోవడం లేదు.

లక్షల్లో లావాదేవీలు చేసి.. రూపాయికీ కొరగాని పరిస్థితుల్లోకి..
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరిశీలిస్తే.. సాగులో వరుస నష్టాలతోనే అప్పుల పాలవుతున్నారని తేలింది. ఏడాదంతా పొలంలోనే ఉన్నా తిండి గింజలకూ సంపాదించుకోలేని దుస్థితి. పంటల పెట్టుబడులు, అమ్మకాల రూపంలో రూ.లక్షల్లో లావాదేవీలు చేసి వందల మంది కూలీలకు ఉపాధి చూపిన రైతులు.. చివరకు చేతిలో వెయ్యి రూపాయలు కూడా లేక విలవిల్లాడుతున్నారు. పిల్లల్ని చదివించలేని అశక్తత, పెళ్లికెదిగిన కుమార్తెలు.. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు, కుటుంబ భవిష్యత్తు తలచుకుని మానసిక ఆందోళనతో ఆత్మహత్యలను పరిష్కారంగా ఎంచుకుంటున్నారని పలువురు వివరించారు. ఒక్కో రైతు కుటుంబాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పులు వెంటాడుతున్నాయి.

బతుకుదెరువు కోసం.. తలోదారికి..

రైతు సాగు చేస్తే సేద్యం నుంచి పంటకోత, అమ్మకం వరకు ఎంతో మందికి ఉపాధి చూపిస్తారు. అలాంటి అన్నదాతే బలవన్మరణానికి పాల్పడితే ఆయన కుటుంబం కూలిపనికి వెళ్లాల్సి వస్తోంది. ఉపాధి దొరక్క, అప్పులిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక భూములు అమ్మేస్తున్న పరిస్థితులు చాలాచోట్ల ఉన్నాయి. భర్త చనిపోయాక.. పూట గడవని పరిస్థితుల్లో కొందరు రైతుల భార్యలు బిడ్డలను తీసుకుని పుట్టింటికి చేరుతున్నారు. దీంతో అప్పటి వరకు కొడుకుపైనే ఆధారపడిన వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. కొందరు తమ బిడ్డల చదువులు మాన్పించి.. దూర ప్రాంతంలో పనులకు పంపిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఆస్తిపరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలా ఏ రకంగా చూసినా రైతు మరణంతో ఆయన కుటుంబం దిక్కులేనిదవుతోంది.

కౌలు రైతు కుటుంబం.. చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం

మిరప బాగా పండితే ఏడాదిలో అప్పులు తీర్చేయొచ్చనే అంజినయ్య ధైర్యం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ముందు నిలబడలేకపోయింది. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పురికొల్పింది. వందలాది కూలీలకు ఉపాధి చూపిన ఆ కుటుంబం ఇప్పుడు హైదరాబాద్‌కు వలసపోయి చిత్తుకాగితాలు ఏరుకుని బతికే దుస్థితి దాపురించింది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం నెరుడుప్పలకు చెందిన ఉల్లిగడ్డల అంజినయ్య ఎకరా రూ.15 వేల చొప్పున 12 ఎకరాలు కౌలు తీసుకుని ఏటా ఉల్లి, మిరప, వేరుసెనగ, వరి పంటలు సాగు చేసేవారు. నాలుగేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో.. తీవ్రంగా నష్టపోయారు. పంట ఖర్చులకు తోడు పిల్లల పెళ్లిళ్లకు చేసిన అప్పులన్నీ కలిసి రూ.32 లక్షలకు చేరాయి. అయినా ఒక్క ఏడాది పండితే మొత్తం తీర్చేస్తాననే ఆయన ధైర్యాన్ని మిర్చి, ఉల్లికి సోకిన తెగుళ్లు దెబ్బతీశాయి. ఈ నష్టాలతో మనస్తాపానికి గురైన అంజినయ్య 2021 డిసెంబరు 13న ఆత్మహత్య చేసుకున్నారు. త్రిసభ్య కమిటీ నివేదికలిచ్చినా బాధిత కుటుంబానికి ఇప్పటి వరకు పరిహారం అందలేదు. ఊళ్లో ఉండలేక హైదరాబాద్‌కు వెళ్లామని కుమారులు ఈరన్న, నరసింహుడు, విజయ్‌ తెలిపారు.

అప్పుల ఒత్తిడితో.. మతిస్థిమితం కోల్పోయి..

పశువులు మేపుకొంటూ, రెండెకరాలు కౌలుకు చేసుకునే అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లికి చెందిన కౌలు రైతు సూరిశెట్టి రెడ్డినాయుడు అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డారు. పెట్టుబడులకు రూ.4 లక్షల వరకు అప్పులు చేసినా పంట కలిసిరాలేదు. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువవడంతో 2020 సెప్టెంబర్‌లో ఉరివేసుకున్నారు. తర్వాత మూడు నెలలకు.. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరు సాగునీటి కాలువలో పడి చనిపోయాడు. అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో భార్య భూలక్ష్మి మతిస్థిమితం కోల్పోయింది. పోషణ కోసం గాజువాక వెళ్లానని రెడ్డినాయుడు కుమారుడు నాగేశ్వరరావు వాపోయారు. భూలక్ష్మి ఒంటరిగా మిగిలింది.

వృద్ధురాలైన తల్లి.. కదల్లేని స్థితిలో తండ్రి

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరానికి చెందిన ఉమ్మిడిశెట్టి వెంకట దుర్గారావు ఆరెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసాడు. వ్యవసాయంలో నష్టాలతో అప్పులు పెరిగాయి. పంటను వదిలేసి పొగాకు బ్యారన్‌ దగ్గర కూలిగా చేరారు. అప్పులతో మానసికంగా కుంగిపోయిన ఆయన బ్యారన్‌ దగ్గరే పురుగుమందు తాగి చనిపోయారు. అయినా ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. ప్రస్తుతం ఆయన భార్య వెంకటలక్ష్మి, 21 ఏళ్ల కుమారుడితోపాటు వృద్ధురాలైన తల్లి, కాలూ చేయి పడిపోయి కదల్లేని స్థితిలో తండ్రి.. పడరాని కష్టాలు పడుతున్నారు.

పొలం అమ్మేసినా.. కలిసిరాని సాగు

వైయస్‌ఆర్‌ జిల్లా కలసపాడు మండలం శంఖవరానికి చెందిన పి.సుబ్బారెడ్డి సాగులో నష్టాలు తట్టుకోలేక ఉన్న భూమినీ అమ్మేశారు. 30 సెంట్లు మిగిలింది. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా.. నాలుగేళ్లుగా నష్టాలే. రూ.7 లక్షల అప్పులు మిగిలాయి. ఆందోళనకు గురైన సుబ్బారెడ్డి 2020 అక్టోబరు 7న ఉరేసుకున్నారు. త్రిసభ్య కమిటీ విచారించినా సాయం అందలేదు. భార్య నాగమ్మ కూలి చేస్తూ జీవిస్తున్నారు. వివాహితుడైన వారి కుమారుడు హజరత్‌రెడ్డి వలస పోయారు. మనవళ్లతో నాగమ్మ ఉంటోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.