ETV Bharat / city

ఎక్కువ, తక్కువ ఇక్కడే.. పార్టీల విరాళాలు, ఖర్చుల లెక్కలు వెల్లడి

author img

By

Published : May 28, 2022, 3:31 AM IST

రాజకీయ పార్టీల విరాళాలు, ఖర్చుల లెక్కలను ఏడీఆర్‌ సంస్థ వెల్లడించింది. వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా.. తమ వద్దే అట్టిపెట్టుకున్న పార్టీల్లో వైకాపా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని ఏడీఆర్ సంస్థ తెలిపింది. వచ్చిన ఆదాయం కంటే 1,584.16 శాతం అధికంగా ఖర్చు చేసి.. తెలుగుదేశం అధికంగా ఖర్చుచేసిన పార్టీల్లో తొలిస్థానాన్ని ఆక్రమించిందని ఆ సంస్థ స్పష్టం చేసింది.

పార్టీల విరాళాలు, ఖర్చుల లెక్కలు వెల్లడి

రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా.. తమ వద్దే అట్టిపెట్టుకున్న పార్టీల్లో వైకాపా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని అసోసియేషన్‌ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్- ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. వచ్చిన ఆదాయం కంటే 1,584.16 శాతం అధికంగా ఖర్చు చేసి.. తెలుగుదేశం అధికంగా ఖర్చుచేసిన పార్టీల్లో తొలిస్థానాన్ని ఆక్రమించిందని ఆ సంస్థ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ, వ్యయాల లెక్కల ఆధారంగా ఏడీఈర్ సంస్థ.. ఆ వివరాలు బయటపెట్టింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో వైకాపాకు 107.89 కోట్ల రూపాయలు విరాళాలు రాగా.. ఆ పార్టీ కేవలం 80 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని వెల్లడించింది. ఇదే సంవత్సరం తెలుగుదేశం పార్టీకి.. 3.252 కోట్ల రూపాయల విరాళాలు రాగా 54.769 కోట్లు అంటే 1,584.16 శాతం అధికంగా ఖర్చు చేసిందని ఏడీఆర్ స్పష్టంచేసింది. 2020-21లో మొత్తం 31 ప్రాంతీయ పార్టీలకు 529.41 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో 149.95 కోట్లు అంటే.. 28.32 శాతం ఆదాయంతో డీఎంకే తొలి స్థానంలో నిలవగా 107 కోట్లు అంటే 20.39 శాతంతో వైకాపా రెండో స్థానంలో నిలచింది. వైకాపా.. తనకు వచ్చిన ఆదాయంలో 99.25 శాతం మొత్తాన్ని ఖర్చు చేయకుండా.. అట్టిపెట్టుకుందని ఏడీఆర్ సంస్థ గణాంకాలు స్పష్టం చేశాయి.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.