రెండ్రోజుల కిందట అసెంబ్లీలో... చంద్రబాబు పట్ల వైకాపా నేతల పదజాలాన్ని అన్ని వర్గాల ప్రముఖులూ ఖండిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు.
మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని... ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Nandamuri Family: 'మెజారిటీ ఉందని... ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు'