ETV Bharat / city

పడి లేవని పర్యాటకం, కాగితాలకే పరిమితమవుతున్న ప్రణాళికలు - APTDC

TOURSIM రాష్ట్రంలో గత మూడున్నరేళ్లలో ఒక్క పర్యాటక ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రకృతి రమణీయత ఉట్టిపడే అనేక ప్రాంతాలున్న రాష్ట్రంలో పర్యాటకులకు తగిన సౌకర్యాలు లేవు. అసంపూర్తిగా నిలిచిపోయిన వివిధ పనులతో సందర్శకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాధాన్య జాబితాలో చేర్చిన వాటిలోనూ అత్యధిక చోట్ల ఇప్పటికీ పనులకు శ్రీకారం చుట్టలేదు.

TOURSIM
TOURSIM
author img

By

Published : Aug 22, 2022, 8:38 AM IST

AP TOURISM : రాష్ట్రంలో గత మూడున్నరేళ్లలో ఒక్క పర్యాటక ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాధాన్య జాబితాలో చేర్చిన వాటిలోనూ అత్యధిక చోట్ల ఇప్పటికీ పనులకు శ్రీకారం చుట్టలేదు. ఈ ప్రాజెక్టుల పూర్తికి ఒక జాతీయ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చినా నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రాధాన్య జాబితాలో చేర్చిన ప్రాజెక్టులు గడువులోగా పూర్తవుతాయాన్నది సందేహమే. ప్రకృతి రమణీయత ఉట్టిపడే అనేక ప్రాంతాలున్న రాష్ట్రంలో పర్యాటకులకు తగిన సౌకర్యాలు లేవు. అసంపూర్తిగా నిలిచిపోయిన వివిధ పనులతో సందర్శకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో 2015-16 నుంచి 2019-20 మధ్య ప్రారంభించి వివిధ కారణాలతో పూర్తి చేయని 55 పనులను రూ.72.20 కోట్లు వెచ్చించి 2022 మార్చిలోగా పూర్తి చేసేందుకు ఏపీటీడీసీ 2021 మే 7న ప్రభుత్వ అనుమతులు పొందింది. నిధుల కొరతతో గడువులోగా పనులు పూర్తి చేయలేకపోయింది. తర్జనభర్జనల తరువాత పెండింగ్‌ ప్రాజెక్టుల్లో నుంచి ముఖ్యమైన 9 పనులను ప్రాధాన్య జాబితాలో చేర్చింది. వీటిని సాధ్యమైనంత తొందర్లో పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏడాది క్రితం ప్రణాళికలు తయారు చేసింది. ఈ ప్రాజెక్టులు ఉమ్మడి కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్నాయి. గండికోటలో ఏపీటీడీసీ నిధులతో రోప్‌వే పనులు ప్రారంభించారు. బ్యాంకు రుణం అందిస్తే మిగిలిన చోట ప్రారంభించాలన్న అధికారుల ప్రయత్నాలు ఫలించడం లేదు.

అన్నీ అసంపూర్తి ప్రాజెక్టులే

* రాష్ట్రంలో అత్యధికులు సందర్శిస్తున్న ప్రాంతాల్లో లంబసింగి ఒకటి. సీజన్‌లో వారాంతంలో రోజూ 6వేల నుంచి 8వేలు, మిగిలిన రోజుల్లో వెయ్యి మంది సందర్శిస్తున్నారు. ఇక్కడికొచ్చే పర్యాటకుల కోసం 2017లో రూ.3.28 కోట్లతో కాటేజీలు ప్రారంభించారు. వీటిలో 8 కుటుంబాలకు వసతితో పాటు 100 మందికి సరిపడా రెస్టారెంటు, మరో 100 మంది కోసం సమావేశ గది ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. రూ.1.72 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాక బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారు నిలిపేశారు.

* గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ వద్ద తీగ మార్గం (రోప్‌వే) పనులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నిలిచాయి. భక్తులు మెట్ల మార్గం, ఘాట్‌రోడ్డు కాకుండా నేరుగా కొండపైకి వెళ్లేలా రూ.7.10 కోట్లతో నాలుగేళ్ల క్రితం మొదలయ్యాయి. 15% పూర్తయ్యాక నిలిపేశారు.

* తూర్పుగోదావరి జిల్లాలో రోజూ వేలాది మంది సందర్శించే ప్రాంతాల్లో మారేడుమిల్లి ఒకటి. ఇక్కడికి సీజన్‌లో వారంతపు రోజుల్లో 6వేలు, మిగతా రోజుల్లో 2వేల మంది వస్తుంటారు. వీరి కోసం రూ.9 కోట్లతో 20 కాటేజీలు, మరో క్లబ్‌హౌస్‌ పనులు నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. వీటిలో 13 కాటేజీలు, క్లబ్‌హౌస్‌ పనులు పూర్తయి వాడుకలోకి వచ్చాయి. మిగతా 7 కాటేజీలు ఇప్పటికీ పూర్తి కాలేదు.

* శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం జగతిపల్లిలో హిల్‌ రిసార్ట్‌ పనులు రూ.7 కోట్లతో నాలుగేళ్ల కిందట ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడి అందాలను ఎత్తైన కొండపై నుంచి పర్యాటకులు తిలకించేలా చేపట్టిన రిసార్టు పనులు పునాదుల దశలోనే ఉన్నాయి. రూ.44 లక్షలకుపైగా ఖర్చు చేసిన గుత్తేదారు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో నిలిపేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.