ETV Bharat / city

Pink Tomato: కొత్త రకం గులాబి రంగు టొమాటో - కొత్తరకం గులాబిరంగు టొమాటో

Tomato: సాధారణంగా టొమాటోలు ఎరుపురంగులో ఉంటాయి. విదేశాల్లో ఇప్పటికే నలుపు, గులాబి, ఆరెంజ్‌ (నారింజ) రంగుల్లో ఉండే టొమాటోలను వినియోగిస్తున్నారు. భారత్‌లో ఇప్పటివరకు ఇతర రంగుల టొమాటోలను సాగుకు విడుదల చేయలేదు. అయితే రోజురోజుకు పరిశోధనల్లో వస్తున్న ప్రగతిలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా గులాబి, ఆరెంజ్‌ రంగు టొమాటోను రూపొందించి తెలంగాణ శాస్త్రవేత్తలు సత్తా చాటారు.

new kind of pink tomato
కొత్తరకం గులాబిరంగు టొమాటో
author img

By

Published : Mar 28, 2022, 9:53 AM IST

Tomato: రోజురోజుకు పరిశోధనల్లో వస్తున్న ప్రగతిలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా గులాబి, ఆరెంజ్‌ రంగు టొమాటోను రూపొందించి తెలంగాణ శాస్త్రవేత్తలు సత్తా చాటారు. సాధారణంగా టొమాటోలు ఎరుపురంగులో ఉంటాయి. విదేశాల్లో ఇప్పటికే నలుపు, గులాబి, ఆరెంజ్‌ (నారింజ) రంగుల్లో ఉండే టొమాటోలను వినియోగిస్తున్నారు. భారత్‌లో ఇప్పటివరకు ఇతర రంగుల టొమాటోలను సాగుకు విడుదల చేయలేదు.

రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గులాబి, ఆరెంజ్‌ రంగు టొమాటోలను అభివృద్ధి చేశారు. వీటిని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సాగుచేసి వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. గులాబీ టొమాటోల్లో క్యాన్సర్‌ను నిరోధించే ‘ఆంథోసైనిన్‌’ అనే పదార్థం అధికంగా ఉంటుందని, సాధారణ రకాలతో పోల్చితే ఆరెంజ్‌ టొమాటోలో బీటా కెరోటిన్‌ (విటమిన్‌ఏ) అధికంగా ఉంటుందని చెబుతున్నారు.

గులాబి టొమాటోలో విత్తిన 55 రోజులకే కాత మొదలవుతుంది. మొక్క ఎత్తుగా పెరిగి, ఎక్కువ కొమ్మలు వేసి, గుత్తులుగా కాసి అధిక దిగుబడినిస్తుంది. వీటి పంటకాలం ఎక్కువని, షెడ్‌నెట్‌ కింద సాగు చేసినప్పటికీ నులిపురుగుల సమస్య రాలేదని పేర్కొన్నారు. ఒక్కో పండు 20గ్రా. బరువుతో దేశవాళీ టొమాటో మాదిరిగా పుల్లగా ఉంటాయి. వీటి తోలు పలుచగా ఉండటం వల్ల తేలికపాటి మంటకే ఉడికిపోతాయి.

ఇదీ చదవండి: టీడీఆర్‌ బాండ్ల వినియోగం నిలిపివేత.. ఆందోళనలో కొనుగోలుదారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.