ETV Bharat / city

తెలంగాణ : విద్యుత్ తీగలు తగిలి మిర్చి లారీ దగ్ధం - అన్నారుగూడెంలో అగ్నిప్రమాదం

విద్యుత్ తీగలు తగిలి మిర్చి లోడుతో వెళ్తున్న లారీ మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనలో పెద్దఎత్తున మిర్చి పంట కాలి బూడిదయ్యింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం అన్నారుగూడెం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

a-mirchi-crop-smashed-in-electric-shock-in-lorry-at-annarugudem-in-chandrugonda-mandal-in-bhadradri-kothagudem-district
తెలంగాణ : విద్యుత్ తీగలు తగిలి మిర్చి లారీ దగ్ధం
author img

By

Published : Apr 3, 2021, 8:31 PM IST

తెలంగాణ : విద్యుత్ తీగలు తగిలి మిర్చి లారీ దగ్ధం

మిర్చి లోడుతో వెళ్తున్న లారీ విద్యుదాఘాతానికి గురైన దగ్ధమైన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. చంద్రుగొండ మండలం అన్నారుగూడెం సమీపంలో మిర్చి బస్తాలతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు రావడంతో లారీతో సహా మిర్చి దగ్ధమైంది.

ఘటనాస్థలికి సమీపంలోనే ఆరబోసిన మిర్చి కుప్పకు మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో పంట పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా మిర్చి పంట అంతా కాలి బూడిదైందని.... రూ.12 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు.

ఇదీ చూడండి: గంజాయి మత్తు...భవిత చిత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.