ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM - 9AM TOP NEWS

ప్రధాన వార్తలు@9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు@9AM
author img

By

Published : Jan 3, 2022, 9:01 AM IST

  • ఇంట్లో గ్యాస్ లీక్.. కుమార్తె సహా దంపతులు సజీవదహనం

తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ తూర్పు బజారులో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీకేజీతో కుమార్తె సహా దంపతులు సజీవ దహనమయ్యారు. మంటలు అంటుకుని మరో కుమార్తె తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమెను పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • VIJAYAWADA BOOK FESTIVAL: సందర్శకులతో కళకళలాడుతున్న.. 32వ పుస్తక మహోత్సవం

బెజవాడలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవం సందర్శకులతో కళకళలాడుతోంది. వేలాది మంది తరలివచ్చి వారికి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. విజ్ఞానంతో పాటు వినోదాన్ని, ఆనందాన్ని అందించడమే లక్ష్యంగా నిర్వాహకులు...అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

  • Thallibidda Express: ఆగిపోతున తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ వాహనాలు.. బాలింతల ఆందోళన

Thallibidda Express: ప్రసవానంతరం తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చే... తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ వాహనాలకు కష్టకాలం వచ్చింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్​ వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు ప్రభుత్వమే ప్రధాన కారణం.

  • 'భూతాపంతో ద్వీపాలకు ముప్పు- నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం'

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచితేనే.. ద్వీపాల అద్భుత అందాలను రక్షించుకోగలమని హెచ్చరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రెండురోజుల లక్షద్వీప్‌ పర్యటన ముగించుకున్న సందర్భంగా అక్కడి అనుభవాలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పంచుకున్నారు.

  • Corona Vaccination: పిల్లలకు నేటి నుంచి కొవిడ్‌ టీకా

Corona Vaccination: దేశంలో 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు సోమవారం నుంచి కొవిడ్‌ టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు. పెద్దల మాదిరిగానే వీరికి కూడా ఒక్కో డోసులో 0.5 మి.లీ. మోతాదు చొప్పున ఇవ్వనున్నారు.

  • అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్​

Us secretary of defence corona positive: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్​కు కరోనా నిర్ధరణ అయింది. కొవిడ్ టీకా బూస్టర్ డోసు కూడా తీసుకున్నప్పటికీ ఆయన కరోనా బారినపడ్డారు.

OTT India: 10 ఏళ్లలో 15 బిలియన్​ డాలర్లకు భారత ఓటీటీ పరిశ్రమ!

OTT India: రానున్న పదేళ్లలో భారత ఓటీటీ పరిశ్రమ విలువ భారీగా పెరగనుందని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ బాస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) అంచనా వేసింది. ఏటా దాదాపు 22-25 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తెలిపింది.

  • Apple Display Technology: ఐఫోన్‌లో కొత్త ఫీచర్‌.. ఫోన్‌ డిస్​ప్లేతో ఛార్జింగ్

Apple Display Technology: యూజర్స్​ సులువుగా ఛార్జింగ్ చేసుకునేలా సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది యాపిల్​ సంస్థ. భవిష్యత్‌లో విడుదల చేసే ఐఫోన్‌, ఐపాడ్‌లలో ఈ సాంకేతికత అందుబాటులో ఉండనుంది.

  • 'బుమ్రా వైస్​కెప్టెన్​ అవ్వడం ఆశ్చర్యమేసింది'

Bumrah vice captain: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్​కు బుమ్రాను వైస్​కెప్టెన్​గా నియమించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు టీమ్​ఇండియా మాజీ సెలక్టర్​, వికెట్​ కీపర్​ సబా కరీమ్​. వైస్ కెప్టెన్సీకి మొదటి ప్రాధాన్యంగా రిషభ్‌ పంత్ ఉంటాడని భావించినట్లు తెలిపాడు.

  • 'ఆర్జీవీని ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా చూడాలనేది నా కోరిక'

RGV News: ఎప్పుడు వివాదాల్లో ఉండే రామ్​గోపాల్ వర్మను.. టాలీవుడ్​ పెద్ద దిక్కుగా చూడాలనేది తన కోరిక అంటూ ఓ యువ డైరెక్టర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెగ చర్చనీయాంశమవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.