ETV Bharat / city

ప్రధాన వార్తలు@9AM

.

9am top news
ప్రధాన వార్తలు@9AM
author img

By

Published : Jul 2, 2020, 8:59 AM IST

  • జనతా బజార్లు

రైతులు పండించిన ఉత్పత్తులకు స్థానికంగా మార్కెటింగ్‌ కల్పించే చర్యల్లో భాగంగానే రాష్ట్రంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రైతులు పండించిన ఉత్పత్తులను స్థానికంగానే మార్కెటింగ్ కల్పించడం ద్వారా గిట్టుబాటు ధర కల్పించి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో శీతల గిడ్డంగి, గోదాములు తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'బాబాయ్​ ఆరోగ్యంపై ఆందోళన'

అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. డిశ్ఛార్జి చేయడంలో ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నాయని.. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. శస్త్రచికిత్స చేయించుకున్న తన బాబాయ్ ఆరోగ్యంగా ఉంటే.. వీల్‌చైర్‌పై ఎందుకు తరలించాలని ఆయన ప్రశ్నించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • సీఎం లేఖ రాసినా..

మందాకిని బొగ్గు గనిని కేంద్రం కర్ణాటకకు కేటాయించింది. క్యాప్టివ్‌ మైనింగ్‌ కింద తీసుకోవాలన్న జెన్‌కో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒడిశాలోని తాల్చేరు గనికి బదులుగా దీన్ని కేటాయించాలని కోరుతూ సీఎం కేంద్రానికి లేఖ రాసినా పరిగణనలోకి తీసుకోలేదు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆన్​లైన్​ చదువులు

ఈ విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్‌ తరగతులే స్వాగతం పలకనున్నాయి. కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు సాధారణానికి వచ్చేదాకా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాకే... నేరుగా బోధన చేపట్టే దిశగా పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకడమిక్‌ కేలండర్‌ను రూపొందిస్తోంది. పాఠ్యాంశాలను 30% తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • డిజిటల్​ సాయం

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్‌ విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచిత ల్యాప్​టాప్​లు ఇచ్చే యోచనలో ఉంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • గ్రీన్‌ సిగ్నల్‌

పర్యాటకులకు శుభవార్త తెలిపింది గోవా ప్రభుత్వం. గురువారం నుంచి పర్యాటకానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అనుమతి పొందినవారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అయితే పర్యాటకులు గోవాకు వచ్చేముందు కరోనా పరీక్షలు చేయించుకొని, నెగెటివ్‌ ధ్రువపత్రంతోనే రావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • సీబీఐ కేసు

ముంబయి విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీవీకే గ్రూప్ అధినేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. సంస్థ ఛైర్మన్​ వెంకట కృష్ణారెడ్డితోపాటు ఆయన కుమారుడు సంజయ్ రెడ్డిని బుక్ చేసింది. విమానాశ్రయానికి సంబంధించి రూ.705 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఆరోపించింది సీబీఐ. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • హాంకాంగ్‌పై డ్రాగన్‌ కొరడా

హాంకాంగ్​పై చైనా తీసుకువచ్చిన జాతీయ భద్రత చట్టం కింద బుధవారం 300 మందిని అరెస్టు చేశారు పోలీసులు. తమ స్వాతంత్య్రాన్ని హరించవద్దంటూ జెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా ఆందోళన చేపట్టారు నిరసన కారులు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • సంక్షోభంలో విజేతగా

అంతర్జాతీయ టెన్నిస్​ టోర్నీలో విజేతగా నిలిచాడు సుమిత్​ నగాల్​. తద్వారా కరోనా కాలంలో ట్రోఫీ సాధించిన తొలి భారత ఆటగాడిగా ఘనత వహించాడు. జర్మనీలో జరిగిన టెన్నిస్​ టోర్నీ పీఎస్​డీ బ్యాంక్​ నార్డ్​ ఓపెన్​ ట్రోఫీ ఫైనల్లో స్థానిక ఆటగాడు డేనియల్​ను ఓడించాడు సుమిత్​. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'భీష్మ' పెళ్లికి ముహూర్తం

నితిన్ పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కరోనా ఉధృతి ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించకపోవడం వల్ల ఇరుకుటుంబాలు త్వరలోనే ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.