- ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాత
కరోనా కష్టంతో పండిన పంట అమ్ముకోలేక... చేసిన అప్పులు తీర్చలేక..అప్పులపై చక్రవడ్డీలు.. ప్రామిసరీ నోట్లు తిరగరాయాలనే ఒత్తిడి..పిల్లల చదువులు, పెళ్లిళ్లు.. ఇలా అన్నీ రైతన్నకు ఉరితాళ్లవుతున్నాయి. ఒక్కో రైతుది ఒక్కో దీన గాథ
- నేడు జగనన్న చేదోడు ప్రారంభం
నిరుపేద చేతి వృత్తిదారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం 'జగనన్న చేదోడు' పథకానికి శ్రీకారం చుట్టనుంది. దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఈ పథకం కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున సాయం అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సాధినేని యామినికి పగ్గాలు
కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా భాజపా నాయకురాలు సాధినేని యామినీ శర్మ నియమితులయ్యారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పాలకమండలి సీఈఓ విశాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కశ్మీర్లో ఎన్కౌంటర్
షోపియాన్ జిల్లా సుగూలో జరుగుతోన్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సజీవంగా పూడ్చేశారు!
కర్ణాటకలోని హవేరి జిల్లాలో 200 పందులను బతికుండగానే పాతేశారు. ఇందుకోసం పెద్ద గుంతను తవ్వించారు అధికారులు. పొలాల్లోకి దూరి పంటను నాశనం చేస్తున్నాయన్న కారణంతోనే ఈ చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ బ్యాటరీతో భూమిని 100 సార్లు చుట్టేయెుచ్చట
ఎలక్ట్రిక్ కార్ల రంగానికి మంచి ఊపునిచ్చే ఆవిష్కరణ చేసింది చైనాకు చెందిన సీఏటీఎల్ కంపెనీ. 20 లక్షల కి.మీ సామర్థ్యం, 16 సంవత్సరాల వారెంటీతో ఓ బాహుబలి కారు బ్యాటరీని రూపొందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాతో గడగడలాడుతున్న ప్రపంచం
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 73.18 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. 4.13 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆతిథ్యానికి అమెరికా రెడీ
టీ-20 ప్రపంచకప్-2023ను అమెరికాలో నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తి చూపుతోంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లకూ తటస్థ వేదికగా ఉంటామని యూఎస్ఏ క్రికెట్ బోర్డు సీఈఓ ఇయాన్ హెగ్గిన్స్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలయ్య బర్త్‌డే
తండ్రికి తగ్గ తనయుడిగా.. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. అభిమానుల గుండెల్లో 'బాలయ్య'గా, 'యువరత్న'గా పేరు తెచ్చుకున్నారు. నేడు ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా బాలకృష్ణ గురించి ప్రత్యేక విశేషాలు మీకోసం..