రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 94 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,710 కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి... కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.
మొత్తం మరణాల సంఖ్య 7,139కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 232 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,76,372కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,199 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి