ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm

.

Topnews
Topnews
author img

By

Published : Oct 16, 2020, 7:01 PM IST

  • ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఈనెల 19నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నీట్​ పరీక్ష ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) నిర్వహించారు. ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా (90శాతం మంది) హజరయ్యారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు

విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సీపీ స్వీయ పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీచేశామన్న డీజీపీ... 'దిశ' స్ఫూర్తిగా ఏడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • దుప్పిని చుట్టి ప్రాణం తీసిన కొండచిలువ

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణిడ్యామ్ సమీపంలోని ఫిల్టర్ హౌస్ వద్ద కొండచిలువ దుప్పిని చుట్టుముట్టి ప్రాణం తీసింది. దాన్ని మింగేందుకు విఫలయత్నం చేసి, ఫలితం లేకపోవడంతో అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న పశువుల కాపరులు ఈ దృశ్యాలను తమ చరవాణుల్లో చిత్రీకరించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • నిండుకుండల్లా జలాశయాలు

కృష్ణా బేసిన్​లో వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భారీ వరదల కారణంగా.. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులించింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • భారత్​లో కనిష్ఠానికి కరోనా మరణాల రేటు​

భారత్​లో కరోనా కేసులు ఓవైపు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు మరణాలు తగ్గడం ఊరట కలిగిస్తోంది. మార్చి 22 నుంచి తొలిసారి మరణాల రేటు కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రేటు 1.52 శాతంగా ఉంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • బిహార్​ బరి: 12 బహిరంగ సభల్లో మోదీ ప్రచారం

బిహార్​ ఎన్నికల్లో భాజపా-జేడీయూ కూటమి విజయం కోసం ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు. దాదాపు 12 బహిరంగ సభల్లో మోదీ ప్రత్యక్షంగా ప్రసంగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్​ 28 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఆ కరోనా వ్యాక్సిన్​ ధర రూ.4,399..!

ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్​ కోసం ఎదురుచూస్తున్న వేళ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి చెందిన సినోవాక్​ టీకాను అత్వవసర వినియోగం కోసం ఓ పట్టణంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్​ రెండు డోసుల ధరను 60 డాలర్లుగా నిర్ణయించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఒక్క మ్యాచ్​.. రోహిత్ కోసం రెండు రికార్డులు!

నేడు (శుక్రవారం) కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగే మ్యాచ్​లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ కోసం రెండు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. మరి వాటిని సాధిస్తాడా? మరింత సమయం పడుతుందా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • అఫ్ఘాన్​లో సత్యదేవ్ అరెస్ట్.. ఎందుకంటే!

'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటుడు సత్యదేవ్​.. తన జీవితంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. ఓ సినిమా చిత్రీకరణ కోసం అఫ్ఘానిస్థాన్​కు వెళితే.. తనను మానవ బాంబు అనుకుని అక్కడి పోలీసులు అరెస్ట్​ చేశారని తెలిపారు. అధికారులు తనను చుట్టుముట్టి తుపాకులు గురి పెట్టగానే తన జీవితం అక్కడే అయిపోయిందని అనుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.