ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM
author img

By

Published : Jul 20, 2022, 4:59 PM IST

  • రాష్ట్రం శ్రీలంక దిశగా సాగుతోందని కేంద్రం కూడా చెప్పింది: పయ్యావుల
    రాష్ట్రంలోనూ శ్రీలంక పరిస్థితులు నెలకొంటాయని 4 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ హెచ్చరించిందని... అదే విషయాన్ని నిన్న కేంద్రం మరోసారి తెలిపిందని పయ్యావుల కేశవ్‌ వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రామాయపట్నం పోర్టుతో మెరుగైన ఉద్యోగావకాశాలు: సీఎం జగన్
    రామాయపట్నం పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని సీఎం జగన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మొండివారిపాలెంలో పోర్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన సీఎం..రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులకు తోడు మరో నాలుగు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన వాటికీ భూమి పూజ చేస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలవరం నిర్మాణ సంస్థతో ప్రభుత్వానికి సమన్వయం లేదు: దేవినేని
    ప్రభుత్వ అసమర్థతతో పోలవరం నిర్మాణం ఆలస్యమైందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రాజ్యసభలో ఎంపీ కనమేడల ప్రశ్నకు కేంద్రం సమధానమే అందుకు నిదర్శనమన్నారు. ప్రాజెక్టు నిర్మిస్తున్న సంస్థతో ప్రభుత్వానికి సమన్వయం లేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రీపోలింగ్ నిర్వహించాలి: కలెక్టర్​కు చంద్రబాబు లేఖ
    తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల్లో అక్రమాలు నిలువరించాలంటూ కలెక్టర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అక్రమాలకు పాల్పడుతుంటే....ప్రశ్నించిన తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గాల్లో ఉండగా పగిలిన విమాన అద్దం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
    దిల్లీ నుంచి గువాహటి వెళ్తున్న గో-ఫస్ట్​ విమాన అద్దం గాల్లో ఉండగా ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అత్యవసరంగా జైపుర్​ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఎన్నో ప్రశ్నలు'.. మహా రాజకీయంపై సీజేఐ అనుమానాలు
    CJI Ramana Shivsena case: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యాజ్యాలపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?
    Srilanka new president: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రణిల్ విక్రమసింఘె(73). బుధవారం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు రణిల్​కే మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది ఆయనకు ఓటేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్టాక్​ మార్కెట్లలో ఫుల్​ జోష్​.. సెన్సెక్స్​ 600 ప్లస్​.. '80' వద్ద రూపాయి
    Stock Markets Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 629 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు లాభపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ సక్సెస్​ మంత్రతో ముందుగు సాగండి- కామన్​వెల్త్​ అథ్లెట్లకు మోదీ దిశానిర్దేశం
    కామన్​వెల్త్​ గేమ్స్​-2022లో పాల్గొనే భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు క్రీడాకారులకు సక్సెస్​ మంత్రను బోధించారు మోదీ. కొందరు క్రీడాకారుల అనుభవాలను మోదీ తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • NBK 107: 'రాయల్టీ కా బాప్​' బాలయ్య ఈజ్​ బ్యాక్​.. షూటింగ్ స్పాట్​కు పోటెత్తిన ఫ్యాన్స్​
    Balakrishna NBK 107 working stills: నందమూరి నటసింహం బాలకృష్ణ-గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఎన్​బీకే 107'. ఇటీవలే కరోనా బారిన పడిన బాలయ్య కాస్త విరామం తీసుకుని మళ్లీ సెట్​లోకి అడుగుపెట్టారు. తాజాగా కర్నూల్​లో ప్రారంభమైన తాజా షెడ్యూల్​ షూటింగ్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్యను చూసేందుకు అక్కడి జనం పోటెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.