- ttd tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లను రేపటి నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CM REVIEW:ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
కొవిడ్ వ్యాప్తి నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాన్సన్ట్రేటర్లు, డీ-టైప్ సిలెండర్లపై, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- MPTC AND ZPTC ELECTIONS: పరిషత్ ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదా
పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ ఆగస్టు 4కి వాయిదా పడింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్‌కు వెళ్లింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌కు నివాళలర్పించిన చంద్రబాబు, లోకేశ్
తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. ఆంధ్రా షుగర్స్ సంస్థ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు ముళ్లపూడి హరిశ్చంధ్ర ప్రసాద్‌కు నివాళులర్పించారు. ఆయన చేసిన సమాజ సేవను స్మరించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కరోనాపై పోరుకు భారత్, అమెరికా నాయకత్వం'
కరోనా మహమ్మారని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలకు అమెరికా, భారత్ నాయకత్వం వహిస్తాయన్నారు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్. కొవిడ్ సమయంలో అమెరికాకు భారత్ చేసిన సాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. అలాగే.. అఫ్గానిస్థాన్‌లో బలగాల ఉపసంహరణ పూర్తయినప్పటికీ ఆ దేశానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. శాంతి, సురక్షితమైన అఫ్గాన్ కోసం ఇరు దేశాలు కృషి చేయాలని అంగీకరించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పెళ్లి వేదికపై వధూవరులు కబడ్డీ కబడ్డీ!
ఓ వివాహ వేడుకలో వధువు చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లిపీటల ఆమె కబడ్డీ ఆడుతుందా అనిపించేంతలా జరిగిన ఈ సన్నివేశం తెగ సందడి చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గంటన్నరలోనే 50 పేజీల బుక్ రాసి బాలిక రికార్డ్!
గంటన్నర సమయంలో.. 50 పేజీల పుస్తకాన్ని చదవమంటేనే.. కొంతమంది తమ వల్ల కాదని చేతులెత్తేస్తారు. అలాంటిది ఓ 13 ఏళ్ల బాలిక మాత్రం అంతే సమయంలో.. ఏకంగా పుస్తకమే రాసేసింది. దాంతో 'ఇంక్జోయిడ్ బుక్ ఆఫ్ రికార్డ్ 2021'లో ఆమె స్థానం సంపాదించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పాక్‌లోని చైనీయులపై మరో దాడి- ఒకరికి గాయాలు
పాకిస్థాన్‌లో జరిగిన కాల్పుల్లో చైనాకు చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఆత్మాహుతి దాడిలో 9 మంది చైనీయులు చనిపోయిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ICC Rankings: మెరుగైన భూవీ, చాహల్, చాహర్ స్థానాలు
ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్(ICC Rankings)లో టీమ్ఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ 16వ ర్యాంకుకు చేరుకున్నాడు. చాహల్, దీపక్ చాహర్‌లు తమ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కృష్ణంరాజుకు లేఖ.. 'మా' ఎన్నికలపై రానున్న స్పష్టత!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Elections) ఎన్నికలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుత 'మా' కార్యవర్గ పదవీకాలం పూర్తవ్వడం వల్ల.. త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ 'మా' క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు పలువురు లేఖ రాశారు. అయితే కృష్ణంరాజు నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి