- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బ్యాంకర్లు సహకరించాలి: సీఎం
వ్యవసాయ రుణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరిగేందుకు బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులను ఆదుకోవాలని, వారికి రుణాల సదుపాయం కల్పించడంపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సర్కార్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు
మాన్సాస్ ట్రస్టు(MANSAS TRUST) ఆధ్వర్యంలోని దేవాలయ ఆస్తులు, వేల ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న సీఎం ప్రయత్నాలకు.. న్యాయం, చట్టం అడ్డుకట్ట వేశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చీకటి జీవోలు కోర్టు బోనులో వీగిపోయాయని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పీల్‌కు వెళ్తాం: మంత్రి వెల్లంపల్లి
మాన్సాస్ ట్రస్టు (Mansas Trust) అంశంలో హైకోర్టు (ap high court) తీర్పుపై అప్పీలుకు వెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు (minister vellampalli srinivasa rao) తెలిపారు. హైకోర్టు తీర్పును పరిశీలించి ముందుకు వెళ్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజధాని రైతుల పిటిషన్
మందడం గ్రామానికి చెందిన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్డీఏ చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డ్రోన్లతో పల్లెలకు టీకాలు
దేశంలోని మారుమూల గ్రామం వరకు కరోనా టీకాలు, ఔషధాలను చేరవేసేందుకు నూతన మార్గాన్ని అన్వేషించింది కేంద్రం. డ్రోన్ల ద్వారా రవాణాకు సంస్థలకు బిడ్లను ఆహ్వానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లోక్‌సభాపక్ష నేతగా కొత్త వ్యక్తి
లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) లోక్‌సభాపక్ష నేతగా పశుపతి కుమార్ పరాస్ ఎన్నికయ్యారు. ఆ పార్టీలోని ఐదుగురు ఎంపీల బృందం చిరాగ్ పాసవాన్ స్థానంలో పరాస్‌ను తమ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.1.5 కోట్లు విలువైన 'అబార్షన్ కిట్లు'
గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో 24,363 అబార్షన్ కిట్లను ఎఫ్‌డీసీఏ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. నేటి సెషన్లో తొలుత నష్టాలను చవిచూసిన సూచీలు క్రమక్రమంగా కోలుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఢీ కొట్టగల సత్తా భారత్ సొంతం
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి కివీస్‌తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)పై సానుకూలంగా స్పందించాడు మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్(Venkatesh Prasad). గతంతో పోలిస్తే టీమ్ఇండియా.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మెరుగుపడిందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాళ్లే నవ్వగలరు
'పూరీ మ్యూజింగ్స్'(Puri Musings) ద్వారా పలు విషయాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా 'సఫరింగ్' గురించి వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.