రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 5,653 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షల 50 వేల 517కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 46 వేల 624గా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 6,659 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6 లక్షల 97 వేల 699గా బులెటిన్ లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో 35 మంది మృతి చెందినట్టు తెలిపింది. మెుత్తం కరోనా మరణాలు 6,194కు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 73 వేల 625 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చేసిన కొవిడ్ పరీక్షల సంఖ్య 64 లక్షల 94 వేల99కి చేరింది. ఇక రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 11.56గా నమోదైంది.
ఇదీ చదవండి