రాష్ట్రంలో కొత్తగా మరో 40 కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్) పరిధిలోనే అత్యధికంగా 33 మందిలో పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో ఏడుగురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
మొత్తం పాజిటివ్ కేసులు 1454 కి చేరాయి. ఇవాళ 13 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్న మొత్తం సంఖ్య 959కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 461 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 34 మంది మృతి చెందారు.