ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

ప్రధాన వార్తలు @ 3 PM

3pm top news
ప్రధాన వార్తలు @ 3 PM
author img

By

Published : Aug 9, 2021, 2:58 PM IST

  • విచారణ రేపటికి వాయిదా

హైకోర్టులో ఊర్మిళా గజపతిరాజు పిటిషన్ దాఖలు చేసింది. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ విషయంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఆమె అప్పీల్‌ చేసింది. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెలంగాణ గైర్హాజరు

హైదరాబాద్​లోనీ జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం ముగిసింది. కేఆర్‌ఎంబీ(కృష్ణా బోర్డు), జీఆర్‌ఎంబీ (గోదావరి బోర్డు) ఛైర్మన్ల నేతృత్వంలో ఈ భేటీ నిర్వహించారు. ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, ఇంజినీర్లు హాజరయ్యారు. రెండు బోర్డుల సమావేశానికి తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు: ఎన్జీటీ

పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టింది. జస్టిస్‌ ఆదర్శకుమార్‌ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం.. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినవారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విచ్చలవిడిగా ఆక్వాసాగు

విశాఖ జిల్లాలో విచ్చలవిడి ఆక్వాసాగుతో జలవనరులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. అధికారుల అండదండలతో రాజకీయనాయకులు ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ చెరువులు తవ్వుతున్నారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు. పంట భూములూ పనికి రాకుండా పోతున్నాయని రైతులు వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెట్టుబడి సాయం విడుదల

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి తొమ్మిదో విడత నిధులను విడుదల చేశారు మోదీ. పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశంలో వ్యవసాయానికి కొత్త దిశలను అందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మోదీ. దాని ద్వారా కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ.. కొత్త అవకాశాల ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దాడిలో అమిత్ షా హస్తం'

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై ఇటీవల జరిగిన దాడి వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పోలీసుల ఎదుటే దాడి జరిగినా.. వారు అడ్డుకోలేదని అన్నారు. ఇలాంటి చర్యలకు తలవంచబోమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అభివృద్ధి బాటలో జమ్ముకశ్మీర్

జమ్ముకశ్మీర్​లోని ఆ పట్టణాల్లో కొంతకాలం కిందటి వరకు తుపాకులు రాజ్యమేలాయి. ముష్కర దాడులు, ఎన్‌కౌంటర్‌ వార్తల్లో వాటి పేర్లు మార్మోగేవి. అయితే కొత్త పారిశ్రామిక విధానంతో పరిస్థితులు మారుతున్నాయి. పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. వాణిజ్యం, ప్రాజెక్టులు, టర్నోవర్‌లు అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెజాన్, ఫ్లిప్​కార్ట్​కు షాక్

ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోటీ చట్టాల ఉల్లంఘనపై సీసీఐ దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆల్​రౌండర్​ వివాహం

న్యూజిలాండ్​ మాజీ ఆల్​రౌండర్​ కోరె అండర్సన్​ ఓ ఇంటివాడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న మేరీ మార్గరెట్(Corey Anderson wife)​తో అండర్సన్​ వివాహం జరిగింది. పెళ్లి వేడుకలకు సంబంధించిన వివరాలు, విశేషాలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు 30ఏళ్ల మాజీ ఆల్​రౌండర్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ వారం విడుదలయ్యే సినిమాలివే!

జులై చివరి వారంలో థియేటర్లలో సినిమా సందడి మొదలైన తర్వాత ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే ఉత్సాహంతో ఈ వారం కూడా మరికొన్ని సినిమాలు ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే భారీ బాలీవుడ్‌ చిత్రాలన్నీ ఓటీటీల వేదికగా వస్తుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.