రాష్ట్రంలో మార్కెట్ యార్డుల ఆధునీకరణ కోసం రూ.212 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. రెండోదశలో మార్కెట్ యార్డుల ఆధునీకరణ , మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉన్నతాధికారులతో చర్చించారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు అనువైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రులు వెల్లడించారు. మార్కెట్ యార్డుల్లో నూతన షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించటం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించినట్టుగా మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు అవుతున్న కొత్త రైతు బజార్లలోనూ మౌలిక సదుపాయాల కల్పన త్వరితగతిన చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: 'అన్ని వర్గాల వారికి సమన్యాయం అందించడమే ప్రభుత్వం లక్ష్యం'