- కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు నమోదు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డిపై కేసు నమోదైంది. చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలతో.. శశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై.. ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రఘురామ విషయంలో ఏపీ సీఐడీ తీరు.. పార్లమెంటుకే అవమానం: కేరళ ఎంపీ
ఎంపీ రఘురామ లేఖకు కేరళ ఎంపీ ప్రేమ్‌చంద్రన్ స్పందించారు. రఘురామ విషయంలో ఏపీ సీఐడీ తీరును ఖండించారు. ఈ ఘటన.. పార్లమెంట్‌కు జరిగిన అవమానంగా ప్రేమ్ చంద్రన్ అభివర్ణించారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని తప్పకుండా లేవనెత్తుతానని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'టీకా తీసుకున్న వారిలో వ్యాధి ప్రభావం స్వల్పమే'
కరోనా రెండో దశ బారిన పడి కోలుకుంటున్న వారిలో.. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరినా.. కొద్ది రోజులకే కొత్త సమస్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ విషయమై.. సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ వసంత సోమవరపుతో ఈటీవీ భారత్ ముఖాముఖి. వీక్షించేందుకు క్లిక్ చేయండి.
- చూడ చక్కనైన పెళ్లి.. మూగ జీవాలకే వివాహ విందు!
పెళ్లి విందు అంటే మనుషులకేనా? మూగ జీవాలది కడుపేగా. వాటికీ రుచులు చూడాలని ఉంటుందిగా! ఇలాగే భావించిన ఓ కొత్త జంట.. ఏకంగా 20 రకాల వంటకాలతో మూగజీవాలకు విందును ఏర్పాటు చేశాయి. ఆ జీవాలు కడుపారా ఆరగించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- Drugs : శంషాబాద్‌లో రూ.53 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.53 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి వచ్చిన మహిళ వద్ద డ్రగ్స్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- దిల్లీ ఆసుపత్రిలో 'మలయాళ' దుమారం
మలయాళ భాషకు సంబంధించి దిల్లీ జిప్మెర్ జారీ చేసిన ఆదేశాలపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. నర్సులు.. పని ప్రదేశంలో మలయాళం మాట్లాడకూడదని.. హిందీ లేదా ఇంగ్లీష్‌నే వాడాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన కారణంగా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది ఆసుపత్రి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రెచ్చిపోయిన బందిపోట్లు- 88మంది మృతి
ఆఫ్రికా నైజీరియాలోని కెబ్బి ప్రాంతంలో బందిపోట్లు మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 88మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- కరోనా అప్డేట్స్, రుతుపవనాల వార్తలే కీలకం!
ఈ వారం స్టాక్ మార్కెట్లకు కరోనా వార్తలు, అంతర్జాతీయ పరిణామాలు, ఇతర ఆర్థిక గణాంకాలు కీలకం కానున్నాయి. వీటన్నింటితో పాటు రుతుపవనాల రాకతో మార్కెట్లో సానుకూలతలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ విషయం అలా తెలిసింది
భారత మాజీ కెప్టెన్ ధోనీ వీడ్కోలు విషయం అందరిలాగే తనకూ సామాజిక మాధ్యమాల ద్వారానే తెలిసిందని యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. మహి ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడడని తెలుసుకోవడానికి తనకు రెండు మూడ్రోజులు పట్టిందని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- అదే నా కలానికి ప్రేరణ: సిరివెన్నెల
"పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు" అంటున్నారు ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన ట్విటర్‌లోకి అడుగిడి సంవత్సరం దాటిన నేపథ్యంలో.. శనివారం 'ఆస్క్ సిరి వెన్నెల' పేరుతో నెటిజన్లతో కాసేపు చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా సినీప్రియులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.