- గురుదేవోభవ
విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించగల స్రష్ట. అతడి ఉన్నతిని అంచనా వేసి తీర్చిదిద్దగల ద్రష్ట. అభివృద్ధి పథంలో నడిపించే చుక్కాని. ఆధునిక కాలంలో.. పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పేవారు సాధారణ ఉపాధ్యాయులుగానే మిగిలిపోతారు. విద్యార్థుల మస్తిష్కాలకు మెరుగులు దిద్ది.. వారి సర్వతోముఖ వికాసానికి సానపెట్టేవారు ఉత్తమ గురువులు అనిపించుకుంటారు. అలాంటి వారు విద్యార్థులందరినీ తమ పిల్లలే అన్నంతగా ప్రేమిస్తారు. వారి అభ్యున్నతి కోసం నిస్వార్థంగా శ్రమిస్తారు. విద్యార్థులు వృద్ధిలోకి వస్తే తాము చిన్నపిల్లల్లా సంతోషిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గురు పూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం: ఏపీ ఉపాధ్యాయులు
గురు పూజోత్సవాన్ని బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు నోటీసులు అందజేశాయి. సోమవారం కార్యక్రమాలకు హాజరు కావద్దని ఇప్పటికే కొన్ని సంఘాలు నిర్ణయించాయి. మరికొన్ని సంఘాలూ ఇదే బాటలో నడుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘విదేశీ సాయం’ అయోమయం
విజయవాడకు చెందిన విద్యార్థికి కెనడాలోని విశ్వవిద్యాలయంలో చదివేందుకు వీసా వచ్చింది. సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం అవుతున్నాయి. మన ప్రభుత్వమేమో ‘విదేశీ విద్య’ పథకానికి దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబరు 30 వరకు సమయం ఇచ్చింది. తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేస్తామంటోంది. తనకు సీటు వచ్చినందున తొందరగా పరిశీలన పూర్తి చేయాలని విద్యార్థి కోరినా అధికారులు పట్టించుకోలేదు. విధిలేక ఆయన కెనడాకు వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒక్కరూ ముందుకు రాలేదు
మధ్య ఆదాయ వర్గాల కోసం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. స్థిరాస్తి వ్యాపారుల కంటే తక్కువ ధరకు, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు భూముల్లో మధ్య ఆదాయ వర్గాలకు (ఎంఐజీ) ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం వేసిన ప్రణాళికకు చుక్కెదురైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 55 మందితో వెళ్తున్న పడవ నదిలో బోల్తా... 10 మంది గల్లంతు
బిహార్‌లోని గంగానదీలో దుర్ఘటన చోటు చేసుకుంది. సుమారు 55 మంది ప్రయాణిస్తున్న పడవ అకస్మాత్తుగా బోల్తపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పట్నా సమీపంలోని దానాపూర్ పట్టణం షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 10 మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 5,910 కరోనా కేసులు.. జపాన్‌లో లక్షకు పైనే..
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 5,910 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.12 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కెనడాలో వరుస కత్తి దాడులు.. ఆ వర్గమే టార్గెట్.. 10 మంది మృతి
కెనడాలో వరుస కత్తిపోట్ల ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనల్లో 10 మంది మృతిచెందగా మరో 15 మంది గాయపడ్డారు. సస్కాచెవాన్ ప్రావిన్సులోని 13 ప్రాంతాల్లో 10 మంది మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వెల్డన్ సమీపంలోని ఓ పట్టణంలోని ఓ వర్గానికి చెందిన వారిపై ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.52,350 పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.54,230 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నేను చేసిన ఆ పనికి ధోనీ మాత్రమే స్పందించాడు: కోహ్లీ
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తాను టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన సమయంలో ధోనీ తనతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంకా ఏమన్నాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎన్టీఆర్ టు విజయ్.. వీరంతా సిల్వర్‌స్క్రీన్ మాస్టర్లు
గురువులు పాఠాలు చెప్పడంతోనే ఆగిపోరు. విద్యార్థులతో మమేకమైపోయి.. అక్షరాలు నేర్పించి, లోకమంటే ఏంటో తెలిసేలా చేస్తారు. శిష్యుల ఉన్నతిలోనే తాము ఎదిగినట్లు భావిస్తారు. నేడు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవంగా.. వెండితెరపై ఉపాధ్యాయుడిగా కనిపించిన హీరోలెవరో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.