- ఆర్థికశాఖపై సీఎం సమీక్ష
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. కేబినెట్ భేటీ అజెండాలో చేర్చే అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్జీటీ అనుమతులు
జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై జోనల్ బెంచ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిపాలనా అంశాలపై టెండర్లకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అగ్నిప్రమాదంపై చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి
విశాఖ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా దృశ్యాలు తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. కార్మికులంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో ఒక్కరోజే 28,498 కేసులు
భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 553 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సచిన్ పైలట్ మద్దతుదారుల సమావేశం
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తమ బలాలను చూపుకునేందుకు పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. సీఎం నివాసంలో సీఎల్పీ భేటీ జరిగిన కొద్ది గంటల్లోనే తమ మద్దతుదారులతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఓ వీడియో విడుదల చేసింది పైలట్ వర్గం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల్లో సెషన్ ప్రారంభించాయి. ఆర్థిక షేర్లలో నమోదవుతున్న అమ్మకాలతో బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్ల నష్టంతో 36,434 వద్ద కొసాగుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ దాదాపు 80 పాయింట్లు కోల్పోయి 10,725 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికానే బెస్ట్
రష్యా, చైనా, భారత్‌ల కంటే అమెరికాలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అందువల్లనే మిగతా దేశాల కంటే యూఎస్‌లో ఎక్కువ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మారిన కోహ్లీ బ్యాటింగ్!
కెరీర్ ప్రారంభంలో కోహ్లీకి ఇచ్చిన సలహా వల్లే ఇప్పుడు అతడు అద్భుత బ్యాట్స్‌మన్ అయ్యాడని మాజీకోచ్ గ్యారీ కిర్‌స్టన్ చెప్పాడు. ఆ విషయాల్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాచ్‌మన్ అని పిలిచేవారు
భారత్‌లో జాతి వివక్ష ఉందని ఆరోపించాడు టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్. గతంలో తనను 'చైనీస్' అని హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాది రాష్ట్రాల్లో నల్లగా ఉన్న వాళ్లను కూడా ఆటపట్టిస్తారని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టార్ వారసులే కానీ
ప్రముఖుల వారసులుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా కొందరు నటీనటులు.. సరైన విజయాలు లేక వెనకబడిపోయారు. వీరిలో కొంతమంది సహాయ నటులుగా కొనసాగుతుండగా, మరికొందరు కెరీర్‌కు వీడ్కోలు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.