ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@11AM - 11AM TOP NEWS

ప్రధాన వార్తలు@11AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు@11AM
author img

By

Published : Dec 26, 2021, 11:02 AM IST

  • పశ్చిమ గోదావరి జిల్లాలో రైలు ఢీకొని ఇద్దరు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులిద్దరూ పశ్చిమబంగాల్​కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

  • RSS CHIEF: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మోహన్ భగవత్

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నారసింహస్వామి వారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు దగ్గరుండి ఆయనతో స్వామివారికి పూజలు చేయించారు.

  • TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే?

TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీవారిని శనివారం 38,160 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 15 వేల 728 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ. 2.73 కోట్లు సమకూరింది.

  • Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,480 పలుకుతోంది.

  • కారు తీయమన్నందుకు వ్యాపారిపై 'పోక్సో' చట్టం ప్రయోగించిన ఎస్​ఐ

తన దుకాణం ముందు నుంచి కారు తీయాలని కోరినందుకు ఓ వ్యాపారిపై ఏకంగా పోక్సో కేసు నమోదు చేశాడు ఎస్సై. తన మైనర్​ కుమార్తెను వ్యాపారి లైంగికంగా వేధించాడనే తప్పుడు ఫిర్యాదుతో కేసు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన కేరళ, కన్నూర్​ జిల్లాలోని పయ్యనూర్​లో జరిగింది.

  • India Covid Cases: దేశంలో మరో 6,987 కరోనా కేసులు

India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 6,987 కేసులు నమోదయ్యాయి. మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,091 మంది కోలుకున్నారు.

  • కరోనా కలవరం... ఫ్రాన్స్​లో ఒకే రోజు లక్ష కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఫ్రాన్స్​లో లక్ష కేసులు నిర్ధరణ అయ్యాయి. ఆ దేశంలో ఒక రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. అమెరికా, రష్యా, సింగపూర్ దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.

  • 'వాట్సాప్ గ్రూపుల్లో ఆ సందేశాలకు అడ్మిన్లు బాధ్యులు కాదు'

Madras HC on Whatsapp Admin: వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుల వివాదాస్పద సందేశాలకు అడ్మిన్లు బాధ్యులను చేయొద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ మెసేజ్​లను ఆడిట్ చేసే బాధ్యత అడ్మిన్లది కాదని తెలిపింది.

  • ఈ ఏడాది టెస్టుల్లో 'సూపర్ స్టార్స్' వీరే!

ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం, ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఓటమి, ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​ల్లో విజయం.. ఇది ఏడాది టీమ్​ఇండియా టెస్టు క్రికెట్​ ప్రయాణం. అయితే ఈ జర్నీలో కొందరు భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో క్రికెట్​ ప్రేమికులను ఆకట్టుకున్నారు.

  • ఈ సాంగ్స్​ కాంట్రవర్సీకి కేరాఫ్​ అడ్రస్​!

ఇటీవలే స్టార్​ హీరోయిన్లు సమంత, సన్నీలియోని చిందులేసిన 'ఊ అంటావా', 'మధుబన్'​ సాంగ్స్​ వివాదాలకు దారి తీశాయి. అయితే పాటలకు వివాదాలు చుట్టుముట్టడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో కాంట్రవర్సీలను ఎదుర్కొన్న సాంగ్స్​ ఏంటో చూసేద్దాం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.