- దెబ్బతీయటం సాధ్యం కాదు!
హిరాఖుడ్ రైలు ప్రమాదంపై విచారణ విషయమై ప్రధాని మోదీకీ ..ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. "విచారణను తప్పుదారి పట్టించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలి" అని ఆయన కోరారు. ట్రాక్ నిర్వహణలో లోపాల కారణంగా జరిగిన ఈ ప్రమాదాన్ని నక్సల్స్ పైకి నెట్టాలని చూశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కార్పొరేషన్లన్నీ సీఎం సొంత వర్గానికే: అచ్చెన్న
వైకాపాలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ.. విద్యావంతులైన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర స్థాయి కీలక పదవుల్లో సింహభాగం ముఖ్యమంత్రి సామాజిక వర్గంతో నింపేశారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తొలి డాక్టరేట్ సాధించిన మన్యం కుర్రాడు
విశాఖ మన్యం కుర్రాడు అగ్రరాజ్యంలో తన సత్తాచాటాడు. తెలుగు తేజం కీర్తిని ఎల్లలు దాటేలా చేశాడు. మన్యం యువకుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి, కాన్సాస్ సిటీ (UMKS) నుంచి డాక్టరేట్‌ను సాధించాడు. యూఎంకేఎస్ చరిత్రలో తొలి డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా భరద్వాజ రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకూ పోరాటం
పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మూడు రోజుల నిరసన దీక్షలు ముగిశాయి. ఆస్తి విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసులు(Covid Cases) క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగాయి. కొత్తగా 42,015 మందికి వైరస్ సోకింది. మరో 3,998 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 36,977 మంది వైరస్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిరాడంబరంగా బక్రీద్
దేశవ్యాప్తంగా వివిధ మసీదుల్లో ముస్లింలు బక్రీద్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దిల్లీ జామా మసీదు సహా చాలా చోట్ల బక్రీద్ సందడి కరవైంది. కేరళలో భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ.. ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత
వివాహ వేడుకలో కలుషిత ఆహారం కారణంగా 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ దౌసా జిల్లా మురళిపుర గ్రామంలో జరిగింది. బాధితులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు(Gold Rates) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.240 తగ్గింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోహ్లీ, రహానె తొలి టెస్టు ఆడేనా?
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు(England test series) ముందు టీమ్ఇండియా సారథి కోహ్లీ, అజింక్య రహానె, ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ గాయాల బారిన పడటం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. ఇప్పటికే విరాట్, రహానె వార్మప్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'హ్యాపీడేస్' కోసం అమెరికా నుంచి..
'హ్యాపీడేస్'తో హిట్ కొట్టి.. 'కొత్త బంగారులోకం' సినిమాతో యువతను తనవైపు తిప్పుకున్న హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh). నేడు(జులై 21) వరుణ్ సందేశ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.