- మంత్రాలయంలో ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు పుష్కరాలను ప్రారంభించారు. మఠం నుంచి నది వరకు ఊరేగింపుగా వచ్చి పీఠాధిపతి.... తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి పుష్కర స్నానం చేసి గంగ హారతి ఇచ్చారు. పుష్కరాల్లో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జనసిరితో మురవనున్న తుంగభద్రమ్మ
పుష్కర సంగమ తరంగ! కమనీయ వేడుక కందెనవోలు మది నింపింది.. రమణీయ ఉత్సవం జనహృదిని తడిమింది.. శృంగేరి గడపన పుట్టి.. కస్తూరి కన్నడనాడు దాటి.. తెలుగు నేలపై పరవళ్లు తొక్కే పావని తుంగభద్ర! సరిసీమ గడపల్ని నిండుగా ముద్దాడి.. వరి చేల దప్పికను ఆర్తితో తీర్ఛి. తళతళల మేనితో సొగసరి వేణిగా.. సీమ ఇంటి సింగారమంతా తానైన తుంగ.. పుష్కర సంగమ తరంగ! పన్నెండేళ్ల కాలం పుష్కరాగమనానికై వేచి ..నవ్య కాంతులతో.. దివ్యరూపంతో.. అలరారే తుంగభద్ర.. అద్వితీయ పావనముద్ర! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనాతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం!
పోలవరం ప్రాజెక్టుకూ కరోనా కష్టాలు తప్పడంలేదు. స్పిల్‌వే గేట్ల ఏర్పాటులో కీలకమైన హైడ్రాలిక్ సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉండగా... వీటి రవాణాలో తలెత్తుతున్న సమస్యలతో జాప్యం పెరుగుతోంది. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయడం అనుమానంగానే కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైరల్: గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే చంపేస్తారట... వైకాపా కార్యకర్త ఆవేదన
పార్టీ కోసం పొలాలు అమ్ముకొని కష్టపడితే బెదిరింపులే బహుమానమా అంటూ ప్రశ్నిస్తున్నాడు ఓ వైకాపా కార్యకర్త. గ్రామంలో గ్రావెల్ తవ్వకాలు అడ్డుకున్నందుకు స్థానిక ముఖ్యనేతలు చంపుతామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేటితో ముగియనున్న జీహెచ్‌ఎంసీ నామినేషన్లు పర్వం
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దూకుడు ప్రదర్శించగా... కాంగ్రెస్, భాజపాలు వేగాన్ని ప్రదర్శించలేకపోయాయి. శుక్రవారం సాయంత్రంతో గడువు ముగుస్తుండటంతో వివిధ పార్టీలకు చెందిన అనేకమంది నాయకులు ముందస్తుగా గురువారం నామినేషన్లు వేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీల కసరత్తు కొనసాగింది. శుక్రవారం ఉదయానికి పూర్తి జాబితాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్‌పై కేంద్రం కసరత్తు
ట్రాన్స్జెండర్లకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేష్లను కల్పించటంపై కసరత్తు చేస్తోంది కేంద్రం. 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు సేసే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మలబార్'లో భారత్- అమెరికా ఫైటర్ జెట్ల విన్యాసాలు
రెండో విడత మలబార్-2020 నావిక దళ విన్యాసాలు ఉత్తర అరేబియా, హిందూ మహా సముద్రాల్లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన మిగ్-29కే, అమెరికాకు చెందిన ఎఫ్-18లు తమ యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకున్నాయి. ఉపరితల బలగాలపై లక్షిత దాడులు చేశాయి. అలాగే.. ఐఎన్ఎస్ విక్రమాదిత్య వాహక నౌక నుంచి మిగ్-29 గాల్లోకి ఎగిరి చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లోహ, ఐటీ షేర్ల దన్నుతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్లో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 230 పాయింట్లకుపైగా పెరిగి 43,832 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా లాభంతో 12,846 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నాయకత్వం కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు'
ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు టెస్టుల్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న అజింక్య రహానేకు వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. కోహ్లీతో పోలిస్తే రహానే భిన్నమైన వ్యక్తని.. ఎట్టిపరిస్థితుల్లో ఆటతీరు, వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దని భజ్జీ అతడికి సూచించాడు. మరోవైపు టెస్టుల్లో కోహ్లీ లేని లోటు కచ్చితంగా కనిపిస్తుందని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉగ్రవాది కసబ్ సినిమాకు ఓకే చెప్పిన సుశాంత్!
ముంబయి 26/11 ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ చరిత్ర ఆధారంగా ఓ సినిమాకు బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ చర్చలు జరిపాడట. ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి దర్శక నిర్మాతలతో సుశాంత్ ఫొన్లో సంభాషించినట్లు ఓ కథనం పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.