ETV Bharat / city

తెలంగాణ: సిబ్బంది చేతివాటం.. రూ.1.39 కోట్లకు పైగా నగదు కాజేత - 1.39 cores of money theft in jangaon

ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ఏటీఎం కేంద్రాల్లో జమచేయాల్సిన నగదును చిన్న చిన్న మొత్తాల్లో కాజేశారు. ఇలా ఇప్పటి వరకు రూ.1,39,67,900 నగదును స్వాహా చేసినట్లు కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిబ్బంది చేతివాటం.. రూ.1.39 కోట్లకు పైగా నగదు కాజేత

author img

By

Published : Feb 6, 2021, 9:53 AM IST

ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపాల్సిన సిబ్బందే చేతివాటం ప్రదర్శించారు. 18 ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ.1,39,67,900 నగదును స్వాహా చేశారు.

తెలంగాణలోని జనగామ జిల్లాలో పలు ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన సిబ్బంది రూ.1,39,67,900 నగదు కాజేశారు. ఆడిట్​ నివేదికపై చోరీ విషయం వెలుగులోకి రావడం వల్ల కంపెనీ ప్రతినిధులు.. జమగామ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టేందుకు రైటర్​ బిజినెస్​ సర్వీసెస్​ ప్రవేటు లిమిటెడ్​ కెంపెనీ బ్యాంకు అధికారులతో ఒప్పందం కుదుర్చుకొంది. ఆ సంస్థలో పనిచేస్తున్న పాసికంటి వెంకటేష్, గుర్రం ఉపేందర్, గుమ్మడువేల్లి చైతన్య కుమార్, గట్టు రాజు.. రోజూ ఏటీఎంలో నగదు నింపేవారు. ఆ సమయాల్లో చిన్న చిన్న మొత్తాల్లో నగదును స్వాహా చేసినట్లు.. ఆడిట్​ నివేదికలో కంపెనీ ప్రతినిధులు గుర్తించారు.

కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదుచేశామని.. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని సీఐ మల్లేష్​ తెలిపారు.

ఇవీచూడండి:పల్లె పోరు: కొనసాగుతున్న ఉద్రిక్తతలు..ఓ వర్గం అభ్యర్థులను బెదిరిస్తున్న ప్రత్యర్థి వర్గం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.