గుంటూరుజిల్లా నరసరావుపేట మండలంలోని రావిపాడులోని ఓ గోదాంలో అక్రమంగా బియ్యం నిల్వలు ఉంచారన్న సమాచారం మేరకు గురువారం రాత్రి విజిలెన్స్ దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 25 కిలోలు బరువున్న 324 బస్తాల బియ్యాన్ని అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన బియ్యంలో పీడీఎస్ బియ్యం కలిసి ఉండవచ్చని విజిలెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోదాం నిర్వహకులను అధికారులు విచారిస్తున్నారు. పీడీఎస్ బియ్యం కపిలిఉన్నట్లయితే కేసునమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి