ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలోని మురళి పొగాకు గ్రేడింగ్ సెంటర్‌లో టపాసులు పడి పూర్తిగా కాలిపోయింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒంగోలు తిరిగి వస్తున్న తరుణంలో ఏడుగుండ్లపాడు వద్ద అభిమానులు కాల్చిన టపాసుల నిప్పు రవ్వలు పొగాకు గోడౌన్‌పై పడ్డాయని... కొద్దిసేపట్లోనే మంటలు వ్యాపించాయని బాధితులు వాపోయారు. మంటలు ఆర్పేందుకు అక్కడి ప్రజలు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రానందున అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పది లక్షల విలువ చేసే పొగాకు పూర్తిగా కాలిపోయింది.
ఇదీ చదవండీ :