సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు... పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో పార్టీకి ఆధిక్యం తగ్గడంపై కార్యకర్తలతో చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓడినప్పుడు అధైర్యపడడం, నాయకత్వ లక్షణం కాదన్న చంద్రబాబు... వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి తెదేపా ఎప్పుడూ ముందుంటుందని గుర్తుచేశారు. కొంత మంది స్వలాభం కోసమే పార్టీ మారుతున్నారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : ''నాకు వెనుదిరగడం తెలియదు.. మరింత పోరాడతా''