నెల్లూరు జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సంయుక్త కలెక్టర్ వెట్రిసెల్వీ తెలిపారు. ఇప్పటివరకు 1.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తారన్నారు. రైతుల వద్ద ఇంకా ధాన్యం ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులకు 16 కోట్ల నగదు ఇంకా చెల్లించాల్సి ఉందని వివరించారు. నిన్న జిల్లాకు ప్రభుత్వం 2 కోట్లు విడుదల చేశాయని తెలిపారు. మిగిలిన మొత్తం పదిరోజుల్లో రైతులకు చెల్లిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండీ :