మద్యం ప్రియుల్ని ఉదయాన్నే హ్యాంగోవర్ నుంచి బైటపడేసే మార్నింగ్ ప్రెష్డిటాక్స్ డ్రింక్ భాగ్యనగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఈ కంపెనీ ఉత్పత్తులు ఇప్పటికే చెన్నై, ముంబాయి విఫణుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధుల తెలిపారు.
మద్యం సేవించిన తర్వాత చివరిగా దీన్ని తాగడం వల్ల కాలేయంపై చెడుప్రభావం పడకుండా కాపాడుతుందని సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. మద్యం మత్తు వదిలించుకునేందుకు ఇంట్లో చేసుకునే నిమ్మకాయ, పెరుగు వంటింటి వైద్యంతో పోలిస్తే కాస్త ఖరీదైనదే. అన్ని మద్యం దుకాణాల్లోను, అంతర్జాల మార్కెట్లోనూ, ఈ-కామర్స్ దుకాణాల్లోను అందుబాటులో ఉంచామని కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు.
ఇదీ చదవండి: 86వ అంతస్తుకు మెట్లపై పరుగు- పదోసారీ గెలుపు