ETV Bharat / briefs

ప్రేమ కోసం కాబోయే భర్తను చంపించిన యువతి - love murder

పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేని ఓ యువతి...కాబోయే భర్తను ప్రియుడితో హత్య చేయించింది. ఈ నెల 5న రంజాన్ పర్వదినం సందర్భంగా కడపజిల్లా రైల్వేకోడూరులో హత్యకు గురైన అబ్దుల్ ఖాదర్...కేసును పోలీసులు ఛేదించారు. ఖాదర్​కు కాబోయే భార్యే...హత్యా పథకం వేసిందని పోలీసులు నిర్థారించారు.

ప్రేమ కోసం కాబోయే భర్తను చంపించిన యువతి
author img

By

Published : Jun 16, 2019, 6:51 AM IST

ప్రేమ కోసం కాబోయే భర్తను చంపించిన యువతి
కడపజిల్లా రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్ అబ్దుల్ ఖాదర్ ఈ నెల 5వ తేదీ రంజాన్ పండుగ రోజున దారుణహత్యకు గురయ్యాడు. బెంగళూరు నుంచి ఇంటికి వస్తోన్న ఖాదర్​ను కిరాయి హంతకులు కొడవళ్లతో నరికి చంపారు. ఈనెల 26న అబ్దుల్ ఖాదర్​కు వివాహం నిశ్చయమైంది. ఈలోపే ఖాదర్ హత్యకు గురికావడంపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అబ్దుల్ ఖాదర్​కు చెన్నైలోని తన బంధువుల అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. కానీ ఆ అమ్మాయికి ఖాదర్​ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమె చెన్నైలో ప్రిన్స్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పినా.... ఖాదర్​నే పెళ్లి చేసుకోవాలని మందలించారు. వివాహం తప్పించేందుకు ప్రియుడితో కలిసి పథకం వేసింది. అబ్దుల్ ఖాదర్​ను చంపమని ప్రియుడిని హుకుం జారీచేసింది. ప్రియురాలి కోరిక మేరకు ప్రిన్స్ తన స్నేహితులతో ప్రణాళిక రచించాడు. పెరంబదూరుకు చెందిన ఆల్బర్ట్, లక్ష్మణ్, పూవరసన్, దీనదయాల్, సెల్వంతో 5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 4న దీనదయాల్, సెల్వం కారులో చెన్నై నుంచి కడప జిల్లా రైల్వేకోడూరు చేరుకున్నారు. బెంగళూరులో పనిచేస్తోన్న ఖాదర్ రంజాన్ పండుగకు ఇంటికి వస్తోన్న సంగతి తెలుసుకోన్నారు. ప్రియురాలు అందించిన సమాచారం ప్రకారం ప్రిన్స్ తన స్నేహితులతో కలిసి...ఈ నెల 5న కోడూరు కృష్ణా సినిమా థియేటర్ వద్ద ఖాదర్​ను నరికి చంపారు.

అనంతరం నిందితులు కారు నంబరు ప్లేట్ మార్చుకుని కోడూరు నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి మీదుగా పారిపోయారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు..అనుమానస్పద కారు కనిపించింది. ఆ దిశగా దర్యాప్తు చేసి కారు వివరాలు తెలుసుకున్నారు. నిందితులు వాడిన కారు ప్రిన్స్ తండ్రిదిగా పోలీసులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ప్రిన్స్, దీనదయాల్, సెల్వంలను అరెస్ట్ చేశారు. కత్తులు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. యువతి, ఆల్బర్ట్, లక్ష్మణ్, పూవరసన్ వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : అభినందనలు చెప్పేందుకు వెళ్తుండగా...

Intro:tafikonda

Body:గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మేకతోటి సుచరిత మొదటి సారిగా తాడికొండ అ నియోజక వర్గంలోని ఫిరంగిపురం లోని పుట్టింటికి వచ్చారు కుటుంబ సభ్యులు నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు బంధుమిత్రుల అభిమానులు నాయకులు అంత సెల్ఫీ దిగారు రు తదుపరి గ్రామాన్ని బాల యేసు కథడ్రల్ దేవాలయంలో బాలయేసును మంత్రి దర్శించుకుని కొవ్వొత్తులు సమర్పించారు కొద్ది సమయం ప్రార్థనలు చేశారు అనంతరం మంత్రి తల్లి తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు ఆ సమయంలో లో మంత్రి ఇ కంటతడి పెట్టుకున్నారు

Conclusion:7702888840 ఓం శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.