ETV Bharat / briefs

మంచినీటి ప్లాంటు కోసం... మహిళల ఆందోళన - కత్తవపాటు

పశ్చిమ గోదావరి కత్తవపాటు గ్రామస్థులు ఆందోళన బాటపట్టారు. గ్రామంలో మంచి నీటి కష్టాలను చూసిన ఓ దాత.. రక్షిత మంచినీటి ప్లాంటు నిర్మించడానికి ముందుకొస్తే పంచాయతీ అధికారులు అడ్డుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అనుమతి ఇవ్వాలంటూ మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు.

మంచినీటి ప్లాంటు కోసం...మహిళల ఆందోళన
author img

By

Published : Jun 27, 2019, 6:54 PM IST

మంచినీటి ప్లాంటు కోసం...మహిళల ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండల పరిషత్తు కార్యాలయం ముందు కత్తవపాటు గ్రామ మహిళలు ధర్నాకు దిగారు. తమ గ్రామంలో రక్షిత మంచి నీటి ప్లాంటు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ఇరగవరం రహదారిపై బైఠాయించారు. గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్న మహిళలు.. కలుషిత నీటిని తాగి రోగాలు బారిన పడుతున్నామని ఆవేదన చెందారు. ఈ సమస్యకు పరిష్కారంగా తమ గ్రామానికి చెందిన దాత ఒకరు...మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వస్తే పంచాయతీ కార్యదర్శి అనుమతించటంలేదని గ్రామస్థులు ఆరోపించారు. ప్లాంటుకు భూమి పూజ చేస్తుంటే అడ్డుకున్నారని వివరించారు. మంచినీటి కోసం ఎన్నిసార్లు గ్రామం పంచాయతీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, కనీసం దాతలు ముందుకొస్తే సహకరించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దాతల సహకారంతో నిర్మించే రక్షిత మంచినీటి ప్లాంటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : సచిన్ అలా అంటే.. సౌరవ్ ఇలా అన్నాడు..!

Intro:FILE NAME : AP_ONG_42_27_VIJAYANIRMALAKU_SRADDANJALI_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రముఖ నటి,దర్శకురాలు విజయనిర్మల మృతి సినీరంగానికి తిరనిలోటని సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు అన్నారు... విజయనిర్మల అనారోగ్యంతో మృతి చెందిందని తెలియగానే ప్రకాశం జిల్లా చీరాలలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానసంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని గడియారస్తంభం కూడలిలో అభిమానులు విజయనిర్మల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.. Body:చీరాలలో విజయనిర్మల కు అభిమానులు ఘన నివాళిConclusion:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఫోన్ : 9766931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.