తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం కొండపల్లిలో రామయ్య అనే వ్యక్తి నుంచి అటవీ అధికారులు చిరుత చర్మం స్వాధీనం చేసుకున్నారు. కొండపల్లి పరిసరాల్లో ఇటీవల ఓ అడవి పంది చనిపోయింది. పందిపై రామయ్య విషం చల్లాడు. ఆ విషాహారం తిని చిరుత, నెమలి మృత్యు వాతపడ్డాయి. చనిపోయిన చిరుత చర్మం, నెమలి ఈకలు తీసుకున్న రామయ్య.. అమ్మటానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు కొండపల్లి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. చింతూరు డీఎఫ్ఓ సాయిబాబు ఆదేశాలతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : నకిలీ నోట్ల బీటెక్ బాబు...కటకటాల పాలయ్యాడు