ETV Bharat / briefs

మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్​కు జైలుశిక్ష​ - డ్రైవర్

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న చోదకులు..ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నిన్నరాత్రి నందిగామలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. డ్రైవర్​ను కోర్టులో హాజరుపర్చగా 10 రోజుల జైలుశిక్ష విధించారు.

మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్​కు జైలు శిక్ష​
author img

By

Published : May 16, 2019, 5:39 PM IST

మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్​కు జైలు శిక్ష​

కృష్ణాజిల్లా నందిగామలో డ్రంక్ అండ్ డ్రైవ్​లో పట్టుబడ్డ డ్రైవర్ బుజ్జికి నందిగామ జ్యుడిషియల్ కోర్టు పది రోజులు జైలు శిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్​ రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు జాతీయ రహదారులపై విస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్
నిన్నరాత్రి నందిగామ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గుంటూరు నుంచి విశాఖ వెళ్తున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మద్యం సేవించినట్లు రుజువుకావటం వలన చోదకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నందిగామ జుడిషియల్ కోర్టు డ్రైవర్ బుజ్జికి పది రోజుల శిక్ష విధించింది.

ఇవీ చూడండి : తప్పతాగి డ్రైవింగ్.. బస్సులో 40 మంది!

Intro:ఈశ్వరాచారి..గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్....లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలను వేగవంతం చేయాలని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కలసి వినతి పత్రం అందచేస్తుమని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరులో సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు . పలుమార్లు పోలీసు అధికారులు, జిల్లా నాయస్థానం వారు అగ్రిగోల్డ్ బాధితుల వివరాలు సేకరించి బాండ్ పేపర్లు, పాస్ బుక్ లు సేకరించి వారికి ఇప్పటి వరకు నగదు చెల్లించలేదని ఆరోపించారు. సత్వరమే వారు గుర్తించిన అగ్రిగోల్డ్ భాదితులకు నగదు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలు తరువాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని వారికి సతర్వమే నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Body:బైట్...ముప్పాళ్ళ నాగేశ్వరరావు... అగ్రిగోల్డ్ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.