అసెంబ్లీలో డైలాగ్ వార్..! సభాపతికి నేతల అభినందనలతో మొదలైన శాసనసభ.. వాడీ వేడీ వాగ్వాదానికి దారితీసింది. కిందటి సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. ఈ సభలో సంప్రదాయాలను నెలకొల్పాలని అధికారపక్ష సభ్యులు సూచించారు. ఈ క్రమంలో.. కిందటి తెదేపా ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. వారిపై చర్యలు తీసుకోకుండా.. కాలయాపన చేశారని విమర్శించారు. దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి తండ్రి వైఎస్ కూడా పార్టీ మారిన చరిత్ర ఉందని.. అది తెలుసుకోవాలని సూచించారు. స్పీకర్ను అభినందించే విషయాన్ని తప్పుదారి పట్టించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఆవేశంగా స్పందించారు. సభలో చరిత్రలు చెప్పొద్దని... కిందటి సభలో తమ పట్ల దాష్టీకంగా వ్యవహరించారని చెప్పారు. 23 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని.. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలన్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇవీ చదవండి..మీరు రాలేదు.. మీరే రమ్మనలేదు!