విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రదర్శన స్టాళ్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులు, బాంబ్ స్క్వాడ్ వినియోగించే పరికరాలు, నేరం జరిగినప్పుడు పోలీసులు ఆధారాలు ఎలా సేకరిస్తారనే అంశాలను దృశ్య రూపంలో ప్రదర్శించారు. స్టాళ్లను వీక్షించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
పోలీసులు వినియోగించే వాహనాలతో పాటు ఇతర ఆయుధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ ఈ స్టాళ్లను ఏర్పాటుచేసిందని డీజీపీ సవాంగ్ తెలిపారు.
ఈ స్టాళ్లను వీక్షించేందుకు ప్రజలు ఉత్సుకత చూపారు. ఆధునాతన ఆయుధాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయుధాలు, పరికరాలను చూసి చిన్నారులు ఆనందపడ్డారు. పోలీసులు విధుల్లో ఎదుర్కొనే సమస్యలను సందర్శకులకు సిబ్బంది వివరించారు.
ఇటువంటి ప్రదర్శనలు చిన్నారుల్లో చైతన్యం తీసుకువస్తాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. సమాజం పట్ల గౌరవం, వృత్తిపై నిబద్ధత పెరుగుతుందని భావిస్తున్నారు. పోలీసుల స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇవీ చూడండి : 'కానిస్టేబుల్, హోంగార్డ్ను పట్టించిన.. ఫోన్ పే'