ETV Bharat / briefs

సీఎంవో ఉన్నతాధికారులకు శాఖల కేటాయింపు - ajeya kallam

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులకు శాఖలు కేటాయిస్తూ.. సీఎం ప్రధాన  సలహాదారు అజేయ కల్లం నిర్ణయం తీసుకున్నారు. సీఎంవోలోని నలుగురు అఖిలభారత స్థాయి అధికారులు, ఓఎస్డీలకు విధుల్లో చేరాలని ఆదేశాలిచ్చారు.

సీఎంవో ఉన్నతాధికారులకు శాఖల కేటాయింపు
author img

By

Published : Jun 13, 2019, 10:51 AM IST

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులందరికీ శాఖలు కేటాయిస్తూ సీఎం ప్రధాన సలహదారు అజేయ కల్లం ఆదేశాలు జారీ చేశారు. సీఎం సలహాదారుగా తనతో సహా సీఎంఓలోని నలుగురు కీలకమైన అధికారులకు, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారుల్లో ఒకరికి శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహదారుగా ఉంటూ..సాధారణ పరిపాలనా శాఖ, హోంశాఖ, ఆర్ధిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలను అజేయకల్లం పర్యవేక్షించనున్నారు.

  • ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పీవీ రమేష్- వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ,విద్యాశాఖ, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక వసతులు, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్ ఫ్రా, ఇంధన శాఖలను పర్యవేక్షించనున్నారు.
  • ​​​​​​​సీఎం కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్య రాజ్ - రవాణా, రహదారులు భవనాల శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ, గృహనిర్మాణం, ఆహార పౌరసరఫరాలు, వినియోగదారుల సమస్యలు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, సెర్ప్, సంక్షేమశాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు తదితరాల వ్యవహారాలు చూస్తారు.
  • ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమితులైన కె.ధనుంజయరెడ్డి - జలవనరులు, పర్యావరణం, అటవీసాంకేతిక, పురపాలక, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, వ్యవసాయం, ఉద్యాన, పర్యాటక శాఖల అధికారిగా వ్యవహరించనున్నారు.
  • అదనపు కార్యదర్శి జె.మురళి - పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ, సహకారం, సాంస్కృతిక అంశాలను పర్యవేక్షించనున్నారు.
  • ఇక సీఎం ప్రత్యేక అధికారులుగా నియమితులైన డాక్టర్ ముక్తాపురం హరికృష్ణ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి అందే విజ్ఞాపనల వ్యవహారాలు చూడనున్నారు. పి.కృష్ణ మోహన్ రెడ్డి సీఎం ఓఎస్డీగా ముఖ్యమంత్రి సమయపాలన, సందర్శకుల అనుమతుల విషయాలు పర్యవేక్షిస్తారు.

ఇవీ చదవండి...సభాపతి నియామకం కాసేపట్లో...

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట పట్టణంలో లో అవివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అసిధార వేణు ఉరి పోసుకుని ఆదివారం సాయంత్రం మృతి చెందిందని భర్త బుజ్జి సామాజిక ఆసుపత్రి తీసుకువచ్చాడు అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు

Body:తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మి అప్పారావు ఆరోపిస్తున్నారు గత కొంతకాలంగా డబ్బుల కోసం సన్ వ్యాధి స్తూ తమ కుమార్తెను హింసిస్తున్నాడని ఆరోపిస్తున్నారు

Conclusion:ఎస్ కోడ్ ఎస్ ఐ జి రాజేష్ కేసు నమోదు చేసి ఇ దర్యాప్తు చేస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.