ETV Bharat / briefs

ఆశావర్కర్ల జీతం రూ.10 వేలకు పెంపు - వైఎస్సారా్ ఆరోగ్య శ్రీ

వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎప్పటినుంచో ఆశావర్కర్లు డిమాండ్ చేస్తోన్న వేతన పెంపుపై.. సీఎం అధికారులతో చర్చించారు. ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని అధికారులను ఆదేశించారు.

వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్
author img

By

Published : Jun 3, 2019, 5:20 PM IST

వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్

రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశావర్కర్ల జీతాలను పది వేల రూపాయలకు పెంచుతున్నట్టు జగన్‌ ప్రకటించారు.

వైద్య ఆరోగ్య శాఖపై ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆశావర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెరిగింది. ప్రస్తుతం మూడు వేల రూపాయల వేతనం అందుకుంటున్న ఆశావర్కర్లు.. ఇకపై పదివేల రూపాయల వేతనం అందుకోనున్నారు. గ్రామీణ స్థాయిలో ఆశావర్కర్ల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆశావర్కర్లు తమ సమస్యలను జగన్‌కు దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారికి ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చూడండి : ప్రజలకు మెరుగైన సేవలందించాలి: జగన్​

Intro:JK_AP_NLR_05_03_ANNADHATHA_NIMMASAGU_RAJA_AVB_C3
anc
నిమ్మ సాగు పై కథనం

Body:నిమ్మ సాగు

Conclusion:బి రాజ నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.