జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఇంకో వ్యక్తిపై విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేశాడు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన తిప్పర్తి కిషన్, లక్ష్మణ్ భూ లావాదేవీల విషయంలో రోడ్డుపై తగాదా పడ్డారు. అనంతరం లక్ష్మణ్ తన ద్విచక్ర వాహనం నుంచి గొడ్డలి తీసి కిషన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు ఈ ఘటనను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కిషన్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : విశాఖలో అసిండెక్స్@19 నౌకా విన్యాసాలు