ఆదినారాయణరెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు: సునీతారెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి.. మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రి హత్య కేసులో.. మంత్రి ఆదినారాయణరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. మంత్రిని.. ముఖ్యమంత్రి వెనకేసుకువస్తున్నారని ఆరోపించారు.
తన తండ్రి హత్యకేసులో ఉన్న అనుమానాలన్నింటినీ సిట్‌కు తెలిపినా...ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి,ఎమ్మెల్సీ బీటెక్ రవిని సిట్ ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేశారు. సిట్ వ్యవహార శైలిపై అనుమానాలున్నాయన్నారు.గుండెపోటు ప్రచారం.. నాకు తెలియదు!
వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం ఎవరు చేశారో తనకు తెలియదని సునీత చెప్పారు. ఈ విషయంలో వాస్తవాలనుదర్యాప్తు బృందంతేల్చాలని ఆమె కోరారు. తమ కుటుంబసభ్యులకు ఈ హత్యతో సంబంధం ఉండి ఉంటే చంద్రబాబు ఇన్నిరోజులు వదిలిపెట్టేవారు కాదని స్పష్టం చేశారు. తమవారిని కావాలనే కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.