ETV Bharat / briefs

భగభగమంటున్న ఎండల్లో ధగధగమంటున్న చంద్రుడు - చంద్రబాబు

కాలు బయట పెడితే ఎండమండుతోంది... కాసేపు బయట నించోడానికే అల్లాడిపోయే పరిస్థితి.. కానీ ఇది ఎన్నికల సీజన్. బయటకు రాక తప్పదు. ప్రత్యర్థుల కన్నా సూర్యుడే యమ డేంజర్. భానుడి భగభగలకు కొందరు డీలా పడిపోతే..ఇంకొందరు ఆస్పత్రిపాలయ్యారు. కానీ ఆయన మాత్రం మండుటెండల్లో చంద్రుడిలా వెలిగిపోతున్నారు. పనిలోకి దిగితే..ఏమీ పట్టించుకోనన్నట్లుగా సాగిపోతున్నారు.

మండుటెండల్లోన చంద్రమా..!
author img

By

Published : Apr 7, 2019, 7:01 AM IST

Updated : Apr 7, 2019, 10:26 AM IST

మండుటెండల్లోన చంద్రమా..!

ఎండలు మండే సీజన్​లో ఎలక్షన్ ముందుకొచ్చింది. ప్రచారం ఊపందుకోవడంతో అభ్యర్ఖులంతా రోడ్లపైనే ఉన్నారు. మండుతున్న ఎండలకు అల్లాడుతున్నారు. ఇప్పటికే కొందరు డీలా పడిపోయారు. ఇంకొందరు ఆస్పత్రుల పాలయ్యారు. కానీ ఆయన ఏ మాత్రం ఎండలను లెక్కచేయక.. పంచ్​లు పేలుస్తూ..సూర్యుడితో సై అంటున్నారు... ఆయనే తెదేపా అధినేత.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.

మండేచంద్రుడు

చంద్రబాబు ఎలా శ్రమిస్తారో అందరికీ తెలుసు. తెల్లారిన దగ్గర నుంచి ఒక్కోసారి అర్థరాత్రి వరకూ పనిచేస్తూనే ఉంటారు. ఇక ఎన్నికలొచ్చాయంటే.. అటు ముఖ్యమంత్రిగా అధికారిక విధులతో పాటు.. ఇటు పార్టీ అధినేతగానూ..తీరికలేని పని. ఎన్నికల కదనంతో కదం తొక్కుతున్నా ఆయన వదనంలో ఎక్కడా చిరునవ్వు చెదరడం లేదు. ఉదయం లేవగానే అటు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఆ వెంటనే పార్టీ సమాచారం. ఆ తర్వాత.. లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం టెలీ కాన్ఫరెన్స్. ఆ వెంటనే బయలు దేరి రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో తేలుతారు. రెండు- ముూడు జిల్లాలను చుట్టేస్తారు. మండే ఎండల్లో రోడ్ షోలు.. సభలు పెడతారు. రాత్రి పదైనా అంతే ఉత్సాహంగా ఉంటారు.

అలుపన్నది ఉందా..?

చంద్రబాబునాయుడు..ఇప్పుడున్న అభ్యర్థులందరికంటే వయసులో పెద్ద. కానీ అందరికన్నా ఎనర్జిటిక్​గా కనిపిస్తున్నారు. తనకన్నా 20ఏళ్లు చిన్నవాళ్లైన జగన్, పవన్​తో పోటీపడి మరీ ప్రచారం చేస్తున్నారు. ఎండల ధాటికి పవన్ కళ్యాణ్ వడదెబ్బకు గురయ్యారు. ప్రచారానికి తాత్కాలిక విరామం ఇచ్చారు. జగన్ కూడా చంద్రబాబుకు దీటుగానే తిరుగుతున్నారు. అయితే ఈ వయసులో కూడా చంద్రబాబు జగన్ కంటే మరింత ఉత్సాహంగా సభల్లో పాల్గొంటున్నారు. ఆయన్న మాటల్లో పిసరంతైనా వాడి తగ్గడం లేదు. నిప్పులు కురిసే ఎండల్లో తిరగలేక అందరికి అలుపొస్తుంటే చంద్రబాబుకు మాత్రం ఉత్సాహం వస్తోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలకు చెందిన కొంతమంది అభ్యర్థులు ఎండలను తట్టుకోలేక ఆసుపత్రులకు కూడా చేరారు. తొలిరోజు నుంచి ఇప్పటి వరకు బాబులో అలుపూ లేదు..సొలుపూలేదు. తనకసలు ఎదురూ లేదు అన్నట్లుగా దూసకెళ్తున్నారు.

ఇవీ చూడండి : హామీ ఇస్తున్నాం... మళ్లీ వస్తాం!: చంద్రబాబు

Intro:AP_GNT_66_06_SATTENAPALLI_LO_BJP_ADHYAKSHYUDU_KANNA_PRACHAARAM_AVB_G3. ఈ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దో చేసుకుంటామని సిబిఐ ఈడి ఆదాయపు పన్ను శాఖ లు రావడానికి వీల్లేదని జిఎస్టి అడగకూడదని మా ఇష్టం వచ్చినట్లుగా దోచుకుంటారని చంద్రబాబు నాయుడు అనడం సరైంది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి నిర్వహించారు పురవీధుల్లో ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ పుస్తక అమ్మకాలపై 100 కోట్లు కట్టాలని ప్రభుత్వానికి ఆదేశించిందన్నారు ముఖ్యమంత్రి ఆయన కొడుకు లోకేష్ ఇసుక నమ్మకుంటే ప్రభుత్వం కట్టాల్సి వస్తుందని అది ప్రజల సొమ్ముని ఆయన పేర్కొన్నారు ఐటి దాడులు పన్నులు ఎగ్గొట్టి వారిపైనే చేస్తారని మీ పార్టీలో ఎక్కువమంది ఉండటంవల్ల దాడులు జరుగుతున్నాయని ఇందులో మోదీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు

Body:బైట్ కన్నా లక్ష్మీనారాయణ భాజపా రాష్ట్ర అధ్యక్షులు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి

Conclusion:విజయకుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588
Last Updated : Apr 7, 2019, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.