ETV Bharat / briefs

నేడు కేంద్ర ఎన్నికల సంఘంతో చంద్రబాబు భేటీ - evms

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ అలసత్వం, ఈవీఎం మొరాయింపులు, అర్ధరాత్రిల్లో పోలింగ్, భారీ క్యూలైన్లు, వైకాపా నేతల దౌర్జన్యాలతో ఈ ఎన్నికలు హాట్ హాట్​గా సాగాయి. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్​ల వ్యవహారంపై చంద్రబాబు నేడు, రేపు దిల్లీలో ఉద్యమించనున్నారు.

నేడు కేంద్ర ఎన్నికల సంఘంతో చంద్రబాబు భేటీ
author img

By

Published : Apr 13, 2019, 5:22 AM IST

ఆంధ్రప్రదేశ్​ ఎలక్షన్ నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు ఎలా నిర్వహిద్దామనుకున్నారో సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. ఈసీ తీరు, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయనున్నారు.

నేడు దిల్లీలో ఈసీతో భేటీకానున్న చంద్రబాబు ఎన్నికల నిర్వహణ తీరుపై నిరసన తెలపనున్నారు. ఇతర పార్టీల నేతలతో కలిసి ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. అనంతరం భాజపాకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ అలసత్వం, ఈవీఎం మొరాయింపులు, అర్ధరాత్రిల్లో పోలింగ్, భారీ క్యూలైన్లు, వైకాపా నేతల దౌర్జన్యాలతో ఈ ఎన్నికలు హాట్ హాట్​గా సాగాయి. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్​ల వ్యవహారంపై చంద్రబాబు నేడు, రేపు దిల్లీలో ఉద్యమించనున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు

ముఖ్యమంత్రితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, సిట్టింగ్‌ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర మంత్రులు నేడు దిల్లీకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్​తో చంద్రబాబు భేటీకానున్నారు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల మొరాయింపుపై ఫిర్యాదు చేయనున్నారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేసేందుకు తెదేపా అధినేత సిద్ధమయ్యారు.

ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలేవమిటనే అంశంపై ఈసీ వివరణ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వీవీ ప్యాట్​ల లెక్కింపుకు ఈసీ దాటవేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించేందుకు ఆరు గంటల సమయం కన్నా ఎక్కువ పట్టదని చంద్రబాబు అన్నారు. గతంలో బ్యాలెట్ ఓటింగ్ ఉన్నప్పుడు..ఓట్ల లెక్కింపుకు ఎన్ని రోజులు పట్టేదో గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చించి జాతీయ స్థాయిలో పోరాటానికి వ్యూహరచన చేస్తున్నారు.

"పోలింగ్‌ ప్రారంభించే సమయం జాప్యం జరిగితే... మరుసటి రోజు అదే సమయంలో పోలింగ్‌ నిర్వహించేందుకు వీలుంది. ఎన్నికల సంఘం 2009 జనవరి 21న చేసిన జారీ చేసిన 25వ నంబరు సూచన ఈ విషయం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 600పైగా కేంద్రాల్లో పోలింగ్ 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. వీటిపై ఈసీకి లేఖలు రాసిన ఫలితం లేకపోయింది".-----నారా చంద్రబాబు నాయుడు , తెదేపా అధినేత

సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు ఎలక్ట్రానిక్ యంత్రాల దుర్వినియోగం సులభమని నిర్థారణ వచ్చి పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిని వినియోగిస్తున్నారన్నారు. మన దేశంలో మాత్రం ఈసీ మొండివైఖరి అవలంభిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

తెదేపా అధినేత చంద్రబాబు

ఇవీ చూడండి : ఈసీపై పోరాడతా.. సహకరించండి: పాల్

Intro:ap_cdp_43_12_ycp loki avhanam_av_g3
place: prodduturu
reporter: madhusudhan

గమనిక దీనికి సంబంధించిన విజువల్స్ ఈ టీవి వాట్సాప్ పంపడమైనది:

కడప జిల్లా ప్రొద్దుటూరు వై ఎం ఆర్ కాలనీ లోని కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని ఆయన నివాసంలో వైకాపా ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కమలాపురం అసెంబ్లీ అభ్యర్థి రవీంద్ర నాథ్ రెడ్డి లు కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి చర్చించారు. వైకాపాలోకి రావాలని కోరారు.

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.