భావాలకందని భావోద్వేగం అమ్మ...!
మాటలకందని భావం అమ్మ...!
అక్షరాలు రాయలేని కావ్యం అమ్మ...!
పేజీల్లో నిక్షిప్తం చేయలేని ప్రేమే అమ్మ...!
బతుకునే పాఠంగా మలిచిన గ్రంథం అమ్మ...!
భావాల వర్ణమాల అమ్మ...!
భరించే భూదేవి అమ్మ...!
పంచభూతాలకు ఆరోరూపమే అమ్మ...!
అమ్మ అంటే ఒక్క పదంలోనో... ఒక్క వాక్యం లోనో... ఒక్క పాటలోనో... ఒక్క వ్యాసం, ప్రసంగంలోనో చెప్పేది కాదు. అమ్మంటే జీవితం.
ఇదీ చూడండి : మాతృదినోత్సవం నాడు అమ్మతో సరదాగా