ETV Bharat / state

మాచర్లలో ఉద్రిక్తత.. తెదేపా కార్యాలయం, వాహనాలకు నిప్పుపెట్టిన వైసీపీ శ్రేణులు

macherla tension
macherla tension
author img

By

Published : Dec 16, 2022, 6:59 PM IST

Updated : Dec 16, 2022, 10:22 PM IST

18:56 December 16

టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడి

తెదేపా కార్యాలయం, వాహనాలకు నిప్పుపెట్టిన వైసీపీ శ్రేణులు

పల్నాడు జిల్లాలోని మాచర్ల రణరంగంగా మారింది. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులు చేశారు. మాచర్లలో శుక్రవారం సాయంత్రం ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు నుంచి ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు కూడా భారీగా మోహరించారు. చిన్న కాన్వెంట్‌ వద్దకు తెదేపా ప్రదర్శన చేరుకోగానే వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు, సీసాలు విసిరారు. టీడీపీ శ్రేణులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు అక్కడికి రాలేదని తెదేపా నేతలు ఆరోపించారు. గొడవ ముగిసిన తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రదర్శన నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెదేపా మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు బలవంతంగా పంపించేశారు. ఆ తర్వాత రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమర దుర్గారావు కారును తగబెట్టారు. తెదేపా ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డిని వాహనాన్ని వైకాపా నాయకులు అనుసరించారు.

డీఐజీకి చంద్రబాబు ఫోన్: మాచర్ల హింసపై గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

దాడులు దారుణం: పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం నేతలపై జరిగిన దాడని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. రౌడీ మూకల దాడులు దారుణం అన్నారు. తెదేపా శ్రేణులుపై దాడులకు దిగటం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. దాడి చేసిన వారిని వదిలి తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయటం దారుణమన్నారు. బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం వైకాపాకు కొమ్ముకాయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నేతల కార్లు తగలబెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలి డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 16, 2022, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.